Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Tdp Senior Leaders In Anantapur Prabhakar Choudhary Raghunath Reddy Jitendra Goud Tippeswamy

Off The Record: పార్టీని నమ్ముకున్న నేతలను హైకమాండ్ గౌరవిస్తుందా?

Published Date :February 18, 2026 , 9:00 pm
By Sudhakar Ravula
  • మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి..
  • జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి టీడీపీలో సీనియర్లు
  • ఐదేళ్ల వైసీపీ హయాంలో పార్టీని బలంగా నిలిపిన ప్రభాకర్చౌదరి
  • ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, చీఫ్ విప్గా పని చేసిన పల్లె
  • పార్టీ ఆవిర్బావం నుంచి టీడీలోపే మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
  • మడకశిర నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి..
Off The Record: పార్టీని నమ్ముకున్న నేతలను హైకమాండ్ గౌరవిస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీ…అటు తెలుగుదేశం పార్టీల్లో ఎంతో మంది నేతల తలరాతలు మార్చేశాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రాంతాల్ని శాసిస్తున్న వారిని ఎటూ కాకుండా చేశాయి. ఇలాంటి వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొందరు టీడీపీ సీనియర్ నాయకుల గురించి చెప్పాలి. ఇందులో టీడీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసి.. పార్టీకి అండగా నిలబడ్డారు.. ఇంతకీ ఎవరా నేతలంటే.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి…టీడీపీలో చాలా సీనియర్ నాయకులు. పార్టీకి మంచి విధేయులు. ఇందులో ముందుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి చెప్పాలి. దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రభాకర్‌ చౌదరి పని చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా పని చేశారు. ఇబ్బందులు ఎదురైనా పార్టీనే నమ్ముకొని పని చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అనంతపురంలో తెలుగుదేశం పార్టీ బలంగా నిలిపారు. పార్టీ కేడర్‌ చెల్లాచెదురుకాకుండా కాపాడుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. మరోవైపు అసెంబ్లీ టికెట్‌ రాకపోయినప్పటికీ…ప్రభాకర్‌ చౌదని పార్టీ కోసం శ్రమిస్తున్నారు. కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయానికొస్తే.. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, చీఫ్ విప్ గా పని చేశారు. పార్టీకి అత్యంత విధేయుడు, సౌమ్యుడు. అయితే గడిచిన ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఆయన కోడలుకు టికెట్ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాలు కావడంతో నో చెప్పలేకపోయారు. అయితే ఇన్నేళ్ల పొలిటికల్ కెరియర్ చూసిన రఘునాథ్ రెడ్డి భవిష్యత్తు పై ఆశలు పెట్టుకున్నాడు. అటు గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ విషయానికొస్తే.. ఆయన కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి బలంగా పని చేస్తోంది. 2014లో ఎమ్మెల్యే అయిన జితేంద్ర గౌడ్ 19లో ఓడిపోయారు. అయితే 2024లో టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచే వారు. కానీ పక్క జిల్లాకు చెందిన గుమ్మనూరు సడన్ గా గుంతకల్లుకు తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ప్రియార్టీ లేకుండా పోయింది. మడకశిర నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి…గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆయనకు గత రెండు పర్యాయాలు ఏదో పదవి ఇస్తారని…గడిచిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది దక్కలేదు. ప్రస్తుతం బీసీ నాయకుడుగా పార్టీలో కీలకంగా ఉన్నారు. సీనియర్ నేతలు పార్టీ కోసం ఎంతో చేసినా.. వారికి మాత్రం న్యాయం జరగలేదన్న ప్రచారం ఉంది. పైగా టికెట్లు త్యాగం చేసినందుకు పార్టీలో కీలక పదవులు వస్తాయని భావించారు. కానీ వారికి నిరాశ ఎదురయింది. ఇన్ని జరుగుతున్న అధిష్టానం ఏదో ఒక రోజు న్యాయం చేయకపోదా అనే ఆశలో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు వారసులు కూడా రాజకీయాల్లో కీలకంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని రోజులు వీరు పడ్డ శ్రమకు, చేసిన త్యాగానికి ఫలితం ఇంతేనా.. అని మౌనంగా కాలం వెళ్లదీస్తున్నారు.

Also Read

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
  • Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
  • Off The Record: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి వింత కష్టం..!
  • Off The Record: అవనిగడ్డ కూటమిలో పరాకాష్టకు చేరిన ఆధిపత్య పోరు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur Politics
  • anantapur tdp leaders
  • Andhra Pradesh TDP news
  • Jitendra Goud
  • loyal TDP leaders

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions