Site icon NTV Telugu

Off The Record: బాధ్యత లేకుండా వ్యవహరించే ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ..! యాక్షన్ తప్పదా..?

Otr Tdp

Otr Tdp

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ టర్మ్‌లో జరిగినంత రచ్చ ఎప్పుడూ జరగలేదు. మూడే మూడు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోందట. అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ తయారైందట. ఉమ్మడి జిల్ల్లాల వారీగా ఎమ్మెల్యేల జాబితాపై దృష్టిపెట్టారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తోంది. త్వరలో వీరికి మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ మాట్లాడారు. సీఎంతో భేటీ తర్వాత కొంతమంది సెట్ అయ్యారని తెలుస్తోంది. కానీ మరికొంతమంది పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందట. వచ్చిన నివేదికలు చూస్తుంటే అంతా నివ్వెరపోయేలా ఉందని సమాచారం.

Read Also: Anasuya Bharadwaj: అతనొక ‘నార్సిసిస్ట్’.. మా హక్కులు మాకు తెలుసు.. శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్..!

శాండ్, ల్యాండ్, లిక్కర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు…మాఫియా కొన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయి…ఉందని టాక్‌ నడుస్తోంది. ఈ పరిస్థితి సెట్ చెయ్యాలని చూస్తోంది పార్టీ హైకమాండ్‌… ఐతే, ఎమ్మెల్యేలు ఎవరెవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది పార్టీ హైకమాండ్‌. ఎవరు కట్టు తప్పుతున్నారనే అంశంపై ఇప్పటికే ఒక నివేదిక రెడీ అయ్యిందట. జోనల్ ఇంచార్జ్‌లకు ఈ బాపతు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారని గుర్తించే బాధ్యతను అప్పగించిందట అధిష్ఠానం. జోనల్ ఇంచార్జ్‌లు లిస్ట్ తయారు చేసి…అవసరం అయితే ఒకసారి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఈ జాబితా లోకేష్‌కు చేరుతుందని సమాచారం.

నంద్యాల పార్లమెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గాడి తప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మంది…విజయనగరం జిల్లాలో ఐదుగురు…నెల్లూరులో నలుగురు…ప్రకాశంలో ముగ్గురు.. శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యే లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. వీరికి అతి త్వరలోనే మంత్రి నారా లోకేశ్‌తో క్లాస్ ఏర్పాటు చేస్తారట. కొత్త ఏడాదిలోనే ఈ ప్రోగ్రాం ఉండే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని అధిష్ఠానం గ్రహించింది. త్వరలోనే మీటింగ్స్ ఏర్పాటు చేయబోతోందట. మొత్తానికి…ఎమ్మెల్యేలతో సమావేశాల తర్వాతైనా మార్పు వస్తుందేమో చూడాలనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది.

Exit mobile version