Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు
- ఇన్ఛార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు..
- నాయకుడు లేక పెరిగిపోతున్న విభేదాలు..
- స్థానికేతరులకు నో అంటున్న లోకల్ తమ్ముళ్లు..
- పార్టీ సమావేశాల్లో సైతం పెరుగుతున్న రచ్చ..
- అధిష్టానం కమిటీని కాదని సొంత కమిటీ ప్రకటించుకున్న నేతలు..
- ఓటింగ్ విధానంలో కొత్త నాయకుడు కావాలన్న డిమాండ్..
- టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్న పి.గన్నవరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారట. పైగా… అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయని, అసలు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే… మనం అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ కేడరే గుసగుసలాడుకుంటోంది. ఈసారి పవర్‌లోకి వచ్చి దాదాపు రెండేళ్ళవుతున్నా…. ఇప్పటికీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌ని నియమించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి వాతావరణమే ఉన్నా… ప్రస్తుతం వ్యవహారం బాగా ముదురుతోందని అంటున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితి కారణంగా స్థానిక నేతల మధ్య అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోందట. ముఖ్యంగా స్థానిక దళిత నాయకుడికే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. స్థానికేతరుల పేర్లు ప్రస్తావనకు వస్తేనే ఆ వర్గం మండిపడుతోంది.
నియోజకవర్గంలోని మెజార్టీ కేడర్ అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో….లోకల్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి, తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయట. తరచూ నిర్వహించే పార్టీ సమావేశాలు వాగ్వివాదాలతో రచ్చరచ్చగా మారుతుండటమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటున్నట్లు సమాచారం. రానురాను పరిస్థితి ఇంకా దిగజారుతోంజేతప్ప… కొంచెం కూడా మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదన్నది నియోజకవర్గ కార్యకర్తల మాట. పార్టీ అధిష్టానం సూచించిన కమిటీని పట్టించుకోకుండా, ఒక వర్గం నాయకులు ముందుగానే తమ సొంత మండల కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. అధిష్టానం ఎంపిక చేసిన అధ్యక్షురాలిని కూడా బహిరంగంగా వ్యతిరేకించారు.
Also Read
మరోవైపు అధిష్టానం సూచించిన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో, నియోజకవర్గంలో రెండు వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు గందరగోళంగా మారాయి. పార్టీ అధిష్టానం సిసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది. ఓటింగ్ విధానంలోనే నాయకత్వాన్ని ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. లేదంటే తామే గ్రామ స్థాయి కమిటీల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరిస్తోంది పార్టీలోని ఒకవర్గం. ఇలాంటి వాతావరణంలో ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందట. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసి, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. కష్టమో, నిష్టూరమో….రిస్క్ తీసుకునైనా…. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని గాడిన పెడతారా? లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!