Site icon NTV Telugu

Off The Record: జనసేన తరపున క్రాంతి.. తండ్రి, తమ్ముడిని ఢీ కొట్టబోతున్నారా..?

Barlapudi Kranti

Barlapudi Kranti

Off The Record: క్రాంతి….. వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి… ఎలక్షన్‌ తర్వాత పార్టీలో చేరారామె. ఇప్పుడిక డైరెక్ట్‌గా తండ్రి, తమ్ముడు గిరి టార్గెట్‌గా పొలిటికల్ కామెంట్స్ చేయడం సంచలనం అవుతోంది. ఆమె పొలిటికల్‌ మూవ్‌మెంట్స్‌పై రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు ముద్రగడ గిరి. అటు పద్మనాభం కొడుకుని సపోర్ట్‌ చేస్తూ… నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో… ఇప్పుడు జనసేన తరపున క్రాంతి యాక్టివ్‌ అవడం, స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం చూస్తుంటే… తండ్రిని డైరెక్ట్‌గా ఢీ కొట్టబోతున్నారా అన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఈ మధ్యకాలంలో ప్రత్తిపాడు పాలిటిక్స్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారట క్రాంతి. పరామర్శల పేరుతో పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నారామె. నియోజకవర్గంలో అనారోగ్యం పాలైన వారిని పరామర్శించడం, ఎవరైనా చనిపోతే… వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చడం, అవసరమైన వాళ్లకు ఆర్థిక సాయం చేయడం లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు క్రాంతి. అటు ప్రస్తుతానికి ప్రత్తిపాడు జనసేన కోఆర్డినేటర్ ఎవరూ లేరు.

Read Also: My Baby : ఈ నెల 11న తెలుగులోకి తమిళ సూపర్ హిట్ మూవీ..

అంతకు ముందు ఇన్ఛార్జ్‌గా ఉన్న నాయకుడిని ఓ డాక్టర్‌తో దురుసుగా ప్రవర్తించారన్న కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది జనసేన. దాంతో…. పార్టీలో ఎలాగూ గ్యాప్‌ ఉంది, పరిణామాలను అనుకూలంగా మల్చుకుని పాతుకుపోతే… నాన్న సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోనే పాతుకుపోవచ్చని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం యాక్టివ్‌గా తిరగడం ద్వారా… తనకు అవకాశం ఇస్తే… పార్టీకి మంచి మైలేజ్‌ తీసుకువస్తానని అధిష్టానానికి కూడా సందేశం పంపాలనుకుంటున్నారట. దానికి అనుగుణంగానే జనసైనికులకు దగ్గర అయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. క్రాంతి కుటుంబం ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటుండగా… మారుతున్న పరిణామ క్రమంలో ఆమె ప్రత్తిపాడు మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్తిపాడు టిడిపి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. అయినా…. పొత్తు ధర్మం ప్రకారం నియోజకవర్గానికి రావలసిన పదవులు రావడంలేదని, పనులు అవడం లేదని అంటున్నారట క్రాంతి. పార్టీ తరపున లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే అలాంటివన్నీ సాధ్యం అంటూ… అట్నుంచి నరుక్కురావాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో నాలుగేళ్ల దాకా ఎన్నికలు లేవు. పోటీ చేసే వాళ్ళు ఎవరో, పక్కకు తప్పుకునే వాళ్ళు ఎవరో అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతుంది.

Read Also: IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!

కానీ… ఆలోపు తనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తండ్రి ముద్రగడ పద్మనాభం అనుచరులు కొందరు కూడా తనకు సపోర్ట్ చేస్తారని చెబుతున్నారట క్రాంతి. పద్మనాభం వైసీపీలోకి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేనివాళ్ళు జనసేనలోకి వస్తారని, పార్టీ బలోపేతం అవుతుంది కదా అని లాజిక్‌ చెబుతున్నారట ఆమె. తన మాటల ద్వారా అటు తమ్ముడు గిరికి కూడా డైరెక్ట్ ఎటాక్ ఇచ్చినట్టు అయిందన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ప్రతిపాడు వైసీపీ ఇప్పటికే… గ్రూపులతో గందరగోళంగా మారింది.. మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, వరుపుల సుబ్బారావు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వర్గాలతో నరసాపురం పార్లమెంట్ వైసిపి అబ్జర్వర్ మదునూరి మురళీకృష్ణంరాజు సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కూడా ముద్రగడకు వ్యతిరేకంగా, యాక్టివ్ గా తిరుగుతున్నారు. అటు ముదునూరి మురళీకృష్ణంరాజు ఇంటికి వెళ్లిన వాళ్లు తన ఇంటి గడప తొక్కొద్దని అంటున్నారట పద్మనాభరెడ్డి. ఆ వ్యవహారాలు అలా నడుస్తుండగానే… ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ తరపున కూతురు యాక్టివ్‌ అవడం పద్మనాభరెడ్డికి ఇరకాటంలా మారవచ్చంటున్నారు పరిశీలకులు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

వారసుడిని ప్రత్తిపాడులో నాయకుడిగా నిలబెట్టేందుకు గతంలో పెట్టుకున్న ఒట్లన్నిటినీ తీసి గట్టున పెట్టారు ముద్రగడ. అయినా సరే… వైసీపీలో అంతా కలిసిరాక సతమతం అవుతున్నారు. కొడుకు గిరి ఎంతవరకు నిలదొక్కుటుంటారన్న అనుమానాలు పెరుగుతున్న క్రమంలోనే కూతురు దూకుడు పెంచడం, తన అనుచరగణాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతుండటం పద్మనాభానికి మింగుడు పడని పరిణామాలు కావచ్చన్న వాదన బలపడుతోంది స్థానికంగా. కుటుంబ కథా చిత్రమ్‌ రక్తి కడుతున్న క్రమంలో… ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో అర్ధంగాక ఆయన మ్యూట్‌ మోడ్‌లోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. తనను కాదని కూతురు దగ్గరికి ఎవరూ వెళ్ళరన్న నమ్మకంతో ఉన్నారట ఆయన. మొత్తానికి సొంత నియోజకవర్గంలో ముద్రగడ కూతురు ఎంట్రీతో ప్రత్తిపాడు రాజకీయాలు యమ రంజుగా మారాయి. పద్మనాభం కూతురు, కొడుకు మధ్య ముందు ముందు ఎలాంటి సవాళ్లు పెరుగుతాయో, డైలాగ్‌లు పేలతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. చొరవ తీసుకుని నియోజకవర్గ రాజకీయాల్లో ఇన్వాల్వ్‌ అయిపోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు క్రాంతి. కొడుకు, కూతురు రాజకీయ ప్రత్యర్థులుగా మారుతున్న క్రమంలో ముద్రగడ వారి కుటుంబ కథా చిత్రమ్‌లో ఎన్ని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయో చూడాలంటున్నారు పరిశీలకులు.

Exit mobile version