Site icon NTV Telugu

Off The Record: బెల్లంపల్లి MLA ఫుల్ బ్యాటింగ్‌లో ఉన్నారా..?

Otr Bellampalli Mla

Otr Bellampalli Mla

Off The Record : బెల్లం చుట్టూ ఈగలన్నట్టుగా… బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. నియోజకవర్గంలో సార్‌.. ఫుల్‌ బ్యాటింగ్‌ స్టార్ట్‌ చేశారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎమ్మెల్యే జి వినోద్‌ పీఏల వ్యవహార శైలిపై చాలా ఆరోపణలు వస్తున్న క్రమంలో… అసలు వీటన్నిటి వెనక ఆయనే ఉన్నారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది బెల్లంపల్లిలో. ఎమ్మెల్యే పీఏలు రోడ్డు మీదే కారు ఆపుకుని మందు తాగుతూ డాన్స్‌లు వేసిన వీడియోలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాన్ని మర్చిపోకముందే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇక సింగరేణి ఉద్యోగుల బదిలీల్లో లక్షలు చేతులు మారుతున్నాయని, అందులో ఎమ్మల్యేకు వాటా వెళ్తోందన్న ఆడియో కలకలం రేపుతోంది. ఇవే కాకుండా ఓమార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న మహిళ సోదరుడి దగ్గర గట్టిగానే డీల్ సెట్‌ చేసుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి బెల్లంపల్లిలో. నియోజకవర్గంలోని ఆకినపల్లి శివారులో మూడు సర్వే నంబర్లలోని భూమి విషయమై ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలున్నాయి. దాన్ని అక్రమంగా చదును చేసి ఏంకగా వెంచర్ వేస్తున్నారట.

ఓ పీఏ పంచాయతీ సెక్రటరీకి ఫోన్‌ చేసి అదంతా ఎమ్మెల్యేగారి మేటర్‌ అని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంద పడకల ఆసుపత్రిలో ఉద్యోగాలు,సోలా ప్లాంట్‌లో కొలువులు, ఓపెన్ కాస్టు గనిలో పని కావాలంటే ఎమ్మెల్యే మనుషులకు ముట్టజెప్పితే చాలు ఉద్యోగం వచ్చినట్టేనన్న టాక్‌ నడుస్తోంది. అధికారుల స్థాయిలో పనుల కోసం ఎమ్మెల్యే తరపున వెళ్తున్న ఓ పీఏను పంపించకండి అంటూ…. జిల్లా స్థాయి ఆఫీసర్స్‌ నేరుగా వినోద్‌కే చెప్పినట్టు తెలిసింది. అయితే… అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉందన్నది లేటెస్ట్‌ టాక్‌. ఇన్నాళ్లు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏల అరాచకం అని అనుకున్నా…. ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందని, అదేమంటే ఎన్నికల్లో అంత ఖర్చు చేశాను మరి రికవరీ చేసుకోవద్దా అని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. పైగా… ఈ వ్యవహారాలను మంత్రి పదవితో లింక్‌ చేస్తున్నారట ఆయన. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాను. మంత్రి పదవి వస్తే సెట్‌ అవుతుందని అనుకున్నాను. అది రాలేదు. మరి పెట్టుబడిని రికవర్‌ చేసుకోవాలంటే ఎలాగంటూ బిజినెస్‌ లెక్కలు చెబుతున్నారట.
పీఏలు కూడా ఇదే విషయం చెబుతూ… సార్‌ రికవరీ మోడ్‌లో ఉన్నారు. పనికి ఇంతని ఇచ్చుకోక తప్పదని చెప్పేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఓ మంత్రి ఇప్పటికే ఎమ్మెల్యేని హెచ్చరించినట్టు తెలిసింది. పరువు పోతోంది. మీకెందుకీ ఖర్మ అంటూ మినిస్టర్‌ వార్న్‌ చేసినట్టు సమాచారం. అదంతా ఒక ఎత్తయితే… సార్‌ నియోజకవర్గానికి రావడమే అరుదు. ఆ వచ్చినప్పుడు కూడా బాగా జాలీ మోడ్‌లో ఉంటారట. ఆయనగారి వ్యాపకాల గురించి ఇంట్లోవాళ్ళు కూడా హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు ప్రధాన అనుచరులు. వినోద్‌కు లాంగ్ డ్రైవ్‌ అంటే మహా సరదా.

సరే… అది పర్సనల్‌. అందులో ఆక్షేపించాల్సింది కూడా ఏం లేదు. కానీ… అలా డ్రైవ్‌కు వెళ్ళేటప్పుడు వెనక సీట్లో ఉండే వ్యక్తుల్ని బట్టి ఆయన లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ మారిపోతాయట. మాంచి జోష్‌లో కుర్రాడైపోయి అసలు స్టీరింగ్‌ వదిలేసి డ్రైవ్‌ చేస్తారట. నేను ఫుల్‌ యాక్టివ్‌, స్టిల్‌ స్టిఫ్‌ అన్న మాటలు ఆయన నోటి నుంచే వస్తాయని చెప్పుకుంటున్నారు. లాంగ్‌ డ్రైవ్‌లు, డ్రైవింగ్‌ స్కిల్స్‌ పూర్తిగా ఆయన వ్యక్తిగతమే అయినా…. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఇలా హైవే మీద స్టీరింగ్‌ వదిలేసి డ్రైవ్‌ చేస్తూ… సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారన్నది ఇక్కడ నైతిక ప్రశ్న. ఓవరాల్‌గా ఓవైపు వసూళ్ళ ఆరోపణలు, మరోవైపు లాంగ్‌ డ్రైవ్‌ మేటర్స్‌ కలగలిసి వినోద్‌ పవురువును రోడ్డు మీదికి లాగుతున్నాయన్నది బెల్లంపల్లి టాక్‌.

Exit mobile version