Off The Record: బెల్లంపల్లి MLA ఫుల్ బ్యాటింగ్‌లో ఉన్నారా..?
- బెల్లంపల్లి ఎమ్మెల్యే ఫుల్ బ్యాటింగ్‌లో ఉన్నారా?..
- రకరకాల వసూళ్ళ ఆరోపణలు..
- పీఏల పేరుతో జరుగుతున్న వ్యవహారాల్లో ఎమ్మెల్యే ప్రమేయం?..
- మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం గట్టి డీల్?..
- హైవే పక్కన వెంచర్లలో అక్రమాలు..
- పీఏల అరాచకాలన్నీ ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయా?..
- పెట్టిన ఖర్చు రికవరీ చేసుకోవాలని సన్నిహితులతో అంటున్నారా?..
- మంత్రి పదవి రాకపోవడంతో తప్పలేదని చెబుతున్నారా?..
- సార్ పర్సనల్ వ్యాపకాలపై కుటుంబ సభ్యుల హెచ్చరికలు?..
- లాంగ్ డ్రైవ్ పేరుతో జాలీ ట్రిప్స్..
- వెనక సీట్లోని వారిని ఇంప్రెస్ చేయడానికి స్టీరింగ్ వదిలేసి డ్రైవింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : బెల్లం చుట్టూ ఈగలన్నట్టుగా… బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. నియోజకవర్గంలో సార్.. ఫుల్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎమ్మెల్యే జి వినోద్ పీఏల వ్యవహార శైలిపై చాలా ఆరోపణలు వస్తున్న క్రమంలో… అసలు వీటన్నిటి వెనక ఆయనే ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది బెల్లంపల్లిలో. ఎమ్మెల్యే పీఏలు రోడ్డు మీదే కారు ఆపుకుని మందు తాగుతూ డాన్స్‌లు వేసిన వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాన్ని మర్చిపోకముందే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇక సింగరేణి ఉద్యోగుల బదిలీల్లో లక్షలు చేతులు మారుతున్నాయని, అందులో ఎమ్మల్యేకు వాటా వెళ్తోందన్న ఆడియో కలకలం రేపుతోంది. ఇవే కాకుండా ఓమార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న మహిళ సోదరుడి దగ్గర గట్టిగానే డీల్ సెట్ చేసుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి బెల్లంపల్లిలో. నియోజకవర్గంలోని ఆకినపల్లి శివారులో మూడు సర్వే నంబర్లలోని భూమి విషయమై ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలున్నాయి. దాన్ని అక్రమంగా చదును చేసి ఏంకగా వెంచర్ వేస్తున్నారట.
ఓ పీఏ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి అదంతా ఎమ్మెల్యేగారి మేటర్ అని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంద పడకల ఆసుపత్రిలో ఉద్యోగాలు,సోలా ప్లాంట్‌లో కొలువులు, ఓపెన్ కాస్టు గనిలో పని కావాలంటే ఎమ్మెల్యే మనుషులకు ముట్టజెప్పితే చాలు ఉద్యోగం వచ్చినట్టేనన్న టాక్ నడుస్తోంది. అధికారుల స్థాయిలో పనుల కోసం ఎమ్మెల్యే తరపున వెళ్తున్న ఓ పీఏను పంపించకండి అంటూ…. జిల్లా స్థాయి ఆఫీసర్స్ నేరుగా వినోద్‌కే చెప్పినట్టు తెలిసింది. అయితే… అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్నది లేటెస్ట్ టాక్. ఇన్నాళ్లు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏల అరాచకం అని అనుకున్నా…. ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందని, అదేమంటే ఎన్నికల్లో అంత ఖర్చు చేశాను మరి రికవరీ చేసుకోవద్దా అని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. పైగా… ఈ వ్యవహారాలను మంత్రి పదవితో లింక్ చేస్తున్నారట ఆయన. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాను. మంత్రి పదవి వస్తే సెట్ అవుతుందని అనుకున్నాను. అది రాలేదు. మరి పెట్టుబడిని రికవర్ చేసుకోవాలంటే ఎలాగంటూ బిజినెస్ లెక్కలు చెబుతున్నారట.
పీఏలు కూడా ఇదే విషయం చెబుతూ… సార్ రికవరీ మోడ్‌లో ఉన్నారు. పనికి ఇంతని ఇచ్చుకోక తప్పదని చెప్పేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఓ మంత్రి ఇప్పటికే ఎమ్మెల్యేని హెచ్చరించినట్టు తెలిసింది. పరువు పోతోంది. మీకెందుకీ ఖర్మ అంటూ మినిస్టర్ వార్న్ చేసినట్టు సమాచారం. అదంతా ఒక ఎత్తయితే… సార్ నియోజకవర్గానికి రావడమే అరుదు. ఆ వచ్చినప్పుడు కూడా బాగా జాలీ మోడ్‌లో ఉంటారట. ఆయనగారి వ్యాపకాల గురించి ఇంట్లోవాళ్ళు కూడా హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు ప్రధాన అనుచరులు. వినోద్‌కు లాంగ్ డ్రైవ్ అంటే మహా సరదా.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
సరే… అది పర్సనల్. అందులో ఆక్షేపించాల్సింది కూడా ఏం లేదు. కానీ… అలా డ్రైవ్‌కు వెళ్ళేటప్పుడు వెనక సీట్లో ఉండే వ్యక్తుల్ని బట్టి ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయట. మాంచి జోష్‌లో కుర్రాడైపోయి అసలు స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేస్తారట. నేను ఫుల్ యాక్టివ్, స్టిల్ స్టిఫ్ అన్న మాటలు ఆయన నోటి నుంచే వస్తాయని చెప్పుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్‌లు, డ్రైవింగ్ స్కిల్స్ పూర్తిగా ఆయన వ్యక్తిగతమే అయినా…. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఇలా హైవే మీద స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేస్తూ… సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారన్నది ఇక్కడ నైతిక ప్రశ్న. ఓవరాల్‌గా ఓవైపు వసూళ్ళ ఆరోపణలు, మరోవైపు లాంగ్ డ్రైవ్ మేటర్స్ కలగలిసి వినోద్ పవురువును రోడ్డు మీదికి లాగుతున్నాయన్నది బెల్లంపల్లి టాక్.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!