NTV Telugu Site icon

Off The Record: గ్రంధి శ్రీనివాస్‌ వైసీపీని ఎందుకు వదిలేశారు?

Grandhi Srinivas

Grandhi Srinivas

Off The Record: గ్రంధి శ్రీనివాస్‌.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, కాపుసామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి టైంలో ఒకసారి, జగన్‌ హయాంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. మేటర్‌ ఏదైనాసరే…సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే గ్రంధి 2019లో పవన్‌ కళ్యాన్‌ను ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. దాంతో వైసీపీలో గ్రంధి పొలిటికల్ కెరీర్‌కు ఇక తిరుగే ఉండదనుకున్నారు అప్పట్లో. సీన్ కట్ చేస్తే… 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరం జరిగిన గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్టుండి వైసికి గుడ్‌బై కొట్టేశారు. ఉరుములేని పిడుగులా ఈ ఆకస్మిక నిర్ణయం ఏంటని ఇటు పొలిటికల్ సర్కిల్స్‌, అటు పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాస్త లోతుల్లోకి వెళితే… నవంబర్‌లో పార్టీ అధినేత జగన్‌ను కలిశారట గ్రంధి. తాను తిరిగి పార్టీలో యాక్టివ్‌ అవుతానని, కాకుంటే అందుకు మే దాకా టైం కావాలని అడిగినట్టు తెలిసింది. అదే సమయంలో ఆయన ఇళ్ళు, వ్యాపార సంస్థల మీద ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. అసలే ఓటమి భారంతో ఉన్న తనకు ఐటీ రైడ్స్‌ టైంలో పార్టీ నుంచి కాస్త సపోర్ట్‌ దొరుకుతుందని ఆశించారట మాజీ ఎమ్మెల్యే. కానీ… అధిష్టానం కొంచెం కూడా ధైర్యం చెప్పకపోగా.. పోరాటం చెయ్యాలి, యుద్ధానికి దిగాలి, మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పడంతో షాకయ్యారట ఆయన. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం కూడా సపోర్ట్ చేయకపోగా… ఏవేవో కబుర్లు చెప్పడం ఏంటని హర్ట్‌ అయి…. అసలు పార్టీలో ఉండాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు.

Read Also: HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ

సరే… జరిగిందేదో జరిగిపోయింది పార్టీ అధినేత చెప్పినట్టే పోరాడదామని ఫిక్సయ్యేలోపు నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులు చేస్తున్న విన్యాసాలతో చిర్రెత్తుకొచ్చిందట గ్రంధికి. అందుకే ఉన్నపళంగా బైబై చెప్పేసినట్టు సమాచారం. అటు అధిష్టానం పట్టించుకోకపోవడం, ఇటు లోకల్‌గా ఇబ్బందులు కలగలిసి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నది గ్రంధి సన్నిహితుల మాట. భీమవరం వైసీపీ వ్యవహారాల్లో వేలుపెట్టే నేతలు ఎక్కువైపోయి… తన ప్రాధాన్యం తగ్గిపోతోందని గ్రహించాకే ఆ నిర్ణయం తీసుకున్నారట ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ముదునూరి ప్రసాదరాజు… గత ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ ఓటమికి పనిచేసిన నాయకులను చేరదీస్తున్నట్టు సమాచారం మరో కారణం అంటున్నారు. జిల్లాలో పార్టీ సభలు, సమావేశాలకు సంబంధించి ముందస్తు సమాచారం వాళ్ళకే వెళ్లడం కూడా గ్రంధికి రుచించలేదని తెలుస్తోంది. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న తనను వదిలేసి… ముదునూరి ఛోటా మోటా నాయకులకు ఫోన్లు చేసి… పనులు పురమాయించడాన్ని కూడా గ్రంధి సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. అందుకే ఉన్న పళంగా పార్టీకి గుడ్‌ బై కొట్టేశారన్నది లోకల్‌ టాక్‌. అప్పుడు పవన్‌ను ఓడించినా సరైన గుర్తింపు దక్కలేదు….ఇప్పుడు పార్టీ కోసం కష్టపడుతున్నా పట్టించుకున్న పాపాన పోవడంలేదు… వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మాట మాత్రం పలకరించలేదు.. పోనీ బాధలు చెప్పుకుందామని అధినేత దగ్గరికెళ్తే… కొత్త లెక్కలు చెప్పి పంపండంతో… ఇక కనీస గుర్తింపు కూడా లేకుండా పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటన్న కోపంతోనే తప్పుకున్నట్టు చెబుతోంది మాజీ ఎమ్మెల్యే వర్గం.

Read Also: CS Letter: ఈ-ఫార్ములా రేసింగ్‌పై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ లేఖ

నర్సాపురం అసెంబ్లీలో పరిస్థితి చక్కబెట్టుకొలేని ముదునూరి ప్రసాదరాజును ఇపుడు జిల్లా అధ్యక్షుడిని చేయడం వల్ల క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప కాపుల్ని పట్టించుకోవడంలేదన్న కోణంలో కూడా గ్రంధి ఆలోచనలు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే పార్టీలో కొనసాగడం కంటే ప్రాధాన్యత ఉన్న చోటుకి వెళ్ళడమే ఉత్తమమని ఫిక్స్‌ అయ్యారని అంటున్నారు. మరోవైపు కాపు ఓటర్ల డామినేషన్ ఉండే భీమవరంలో జిల్లా అధ్యక్షుడు తన సామాజిక వర్గానికి చెందిన నేతనే ఇన్ఛార్జ్‌గా నియమించే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా అధిష్టానానికి తెలిసే జరుగుతోందా లేక తెలియకుండానా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. మొత్తం మీద గ్రంధి ఎపిసోడ్‌ భీమవరం వైసీపీని కుదిపేస్తోందని అంటున్నారు పరిశీలకులు.