Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Bjp Mla Vishnu Kumar Rajus Remarks Put Nda Coalition Government In A Tight Spot

Off The Record: కూటమి సర్కార్ ని ఇరుకున పెడుతున్న ఆ ఎమ్మెల్యే మాటలు.. !

Published Date :January 10, 2026 , 10:01 pm
By Sudhakar Ravula
  • కూటమి సర్కార్‌ని ఇరుకున పెడుతున్న విష్ణు మాటలు..
  • ఈసారి ప్రాధాన్యం దక్కుతుందనుకున్నా నో..
  • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంశాలపై డిఫరెంట్‌ టోన్‌..
  • విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ విషయంలో తేడా వాయిస్‌..
  • టీడీపీ పెద్దలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి..
  • రుషికొండ కేబినెట్‌ సబ్‌ కమిటీపై అసహనం..
  • విష్ణుకు వత్తాసు పలికిన లోకల్‌ ఎమ్మెల్యేలు..
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రోడ్డుపై హాట్‌ కామెంట్స్‌..
  • రోడ్డు వేసే చర్యలు తీసుకోమని ఎంపీ శ్రీ భరత్‌కు సూచన..
  • మనసులో ఏదో ఉంచుకుని ఇరికిస్తున్నారా అన్న డౌట్స్‌..
  • ఏళ్ళ తరబడి రూ.120 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉందా?..
  • బిల్లు కోసమే టోన్‌ మారుతోందని టీడీపీలో చర్చ..
Off The Record: కూటమి సర్కార్ ని ఇరుకున పెడుతున్న ఆ ఎమ్మెల్యే మాటలు.. !
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పెన్మత్స విష్ణుకుమార్ రాజు….. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌. విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మేటర్ ఏదైనాసరే కుండ బద్ధలు కొట్టేయడం ఆయనకు అలవాటు అన్న అభిప్రాయం ఉంది. అదే అసవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్‌ వస్తున్నాయి చాలా మందికి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే…. తెర వెనక వ్యవహారం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో… ఈసారి కూటమి ప్రభుత్వం కొలువు దీరాక విష్ణుకు ప్రాధాన్యం దక్కుతుందని భావించారు చాలామంది. ముఖ్యమంత్రితో వుండే సాన్నిహిత్యం కారణంగా ఈక్వేషన్లు చూడకుండానే సముచిత స్ధానం కల్పిస్తారనే ప్రచారాలు సైతం నడిచాయి. కానీ… అంతిమంగా ఆయన అసెంబ్లీలో తన పార్టీ ఎల్పీ లీడర్‌ పోస్ట్‌తోనే సరిపెట్టుకోకతప్ప లేదు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్‌ రాజు మెల్లిగా గొంతు సవరించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంశాల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు డిఫరెంట్‌గా వుంటోంది. కూటమి ప్రభుత్వం క్రెడిట్‍ కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం గాలితీసేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో విష్ణుకుమార్ రాజు మూడు కీలక ప్రాజెక్ట్ ల మీద చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడుల ప్రస్తావన నుంచి ప్రచారం పీక్స్ లోకి వెళ్లీంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఏపీ అభివృద్ధికి ఇది గేమ్‌ ఛేంజర్‌ భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ వైబ్ కొనసాగుతుండగానే విష్ణుకు మార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. డేటా సెంటర్ల వల్ల లక్షల్లో ఉద్యోగాల కల్పన వుండదని….ఎకో సిస్టం ద్వారానే అది సాధ్యం అవుతుందని తేల్చేశారు. దీంతో డేటా సెంటర్ల ద్వారా అంటే… అనుబంధ విభాగాలతో కలుపుకునే చూడాలని టీడీపీ పెద్దలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే… కొద్దిరోజుల క్రితం రుషికొండ మీద కూడా బాంబ్ పేల్చారు విష్ణు. సప్త రుషుల తపోకేంద్రమైన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు కేటాయించాలని, గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ చేయవద్దని సూచించారాయన. హోటల్స్, ఇతర అవసరాలకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పిన కేబినెట్ సబ్ కమిటీ… స్ధానిక ప్రజాప్రతినిధులను సంప్రదించ కుండానే నిర్ణయం తీసేసుకుంటుందా….? అని ప్రశ్నించడం ద్వారా విస్త్రుతమైన చర్చకు తెరతీశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రస్తావన తెచ్చాక మిగతా శాసనసభ్యులు సైతం అంతేగా….అంతేగా… అనడం ఇక్కడ కొసమెరుపు. ఇక ఈ రెండిటికంటే పెద్ద వ్యవహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ట్రయిల్ రన్ ముగిశాక అధికార, విపక్షాలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత తమదంటే తమదని వాదులాడుతున్న టీడీపీ, వైసీపీ అసలు 2014-19 మధ్య ఈ అనుమతులు లభించడానికి కారణమైన NDA ప్రభుత్వాన్ని, బీజేపీని పక్కనబెట్టేయడం విచిత్రం. కమలం పార్టీ పాత్రను కరివేపాకులా తీసేయడం నచ్చలేదో…..లేక అంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు రోడ్డు ఎందుకు వేయలేదని వాస్తవంగా నిలదీయాలనుకున్నారోగానీ… డీఆర్సీ వేదికగా విష్ణు సంధించిన వ్యంగ్రాస్త్రాలు చర్చనీయాంశం అయ్యాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడానికి రెండు గంటలు పడుతుందని, అదే వందే భారత్ రైల్లో అయితే నాలుగు గంటల్లో విజయవాడ వెళ్ళిపోవచ్చని అన్నారాయన. రోడ్డు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ శ్రీ భరత్ ను కోట్ చేసి మరీ కోరడం ఆసక్తికరంగా మారింది.

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

అదే సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని సింబల్ చూపించి మరీ మాట్లాడేశారు ఈ సీనియర్‍ ఎమ్మెల్యే. దీంతో విష్ణు వ్యవహారశైలి ఏదో తేడాగా వుందని, నిజాలే అయినా… అలా నిష్టూరంగా మాట్లాడటం ద్వారా ఇరుకునపడేస్తున్నారని కూటమి నేతలు కలవరపడుతున్నారట. అయితే… అదే సమయంలో ఆయన సమస్యల్ని లేవనెత్తుతున్నారా లేక మనసులో ఏదో ఉంచుకుని కావాలనే ఇరికిస్తున్నారా అన్న అనుమానం కూడా కూటమి వర్గాల్లో ఉందంటున్నారు. ప్రత్యేకించి టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనక ప్రజా ప్రయోజనాలపై స్పందించడమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా తీరని వేదన ఒకటి ఆయన్ని అలా మాట్లాడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు నుంచి విష్ణుకుమార్ రాజు ఫ్యామిలీ కాంట్రాక్ట్స్ చేసేది. ఆ క్రమంలోనే… 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణ కాంట్రాక్ట్‌ విష్ణు కంపెనీకి దక్కింది. దీనికి సంబంధించి దాదాపు 120కోట్ల రూపాయల బకాయిలు వున్నట్టు తెలుస్తోంది. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్స్‌ అంతా నలిగిపోతున్నారని, ప్రభుత్వ మాట నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు అప్పుల పాలైపోతున్నారని సందర్భం వచ్చిన ప్రతీసారీ ప్రస్తావిస్తుంటారు ఎమ్మెల్యే. ఆ అసంతృప్తితోనే… విష్ణు ఛాన్స్‌ దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారా అన్న డౌట్స్‌ టీడీపీ నాయకులకు కూడా ఉన్నాయట. కారణం ఏదైనా… బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం కూటమికి పంటికింద రాయిలా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP politics latest news
  • Bhogapuram Airport controversy
  • BJP MLA Vishnu Kumar Raju
  • Coalition government challenges AP
  • Google Data Center Vizag

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions