NTV Telugu Site icon

Off The Record: బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు..? ఈటలకే అవకాశం..?

Bjp

Bjp

Off The Record about BJP Floor Leader in Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వివరణ ఇవ్వాలని నోటీసులు ఇస్తే… వాటికి రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో బీజేపీకి పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ లేకుండా అయ్యారు. రాజాసింగ్‌ సస్పెన్షన్ వ్యవహారం ఇంకా పార్టీ కోర్టులోనే ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత లేకుండానే… సమావేశాలకు హాజరు కానుంది. ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్… పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా సభకు హాజరు కానున్నారు. దీంతో సభలో ముగ్గురు ఒకే దగ్గర కూర్చుంటారా… లేక వేర్వేరు గా కూర్చుంటారా… అనే చర్చ జరుగుతోంది. రాజా సింగ్ సభలో ఎలా వ్యహరిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Read Also: Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?

రాజా సింగ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశాక… ఆయన మీద పెట్టిన పీడీ యాక్ట్‌ ఎత్తేశాక… మొదటిసారిగా శాసనసభలో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో అధికార పక్షం నుండి ఎలాంటి కామెంట్స్ వస్తాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ లో కూడా రాజా సింగ్ సస్పెన్షన్ వ్యవహారం తేల్చకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక ఈటల రాజేందర్ బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పెద్దగా పాల్గొన్నది లేదు. రెండు సార్లు సభ నుండి సస్పన్షన్‌కు గురయ్యారు ఈటల. తనను కావాలనే సభలో ఉండకుండా చేస్తున్నారని అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు. మరి బడ్జెట్ సమావేశాలలో ఈటల రాజేందర్ విషయంలో… అధికార పక్షం వైఖరి ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. ఈసారైనా సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను అసెంబ్లీలో ఉండనిస్తారా… ఒకవేళ అదే జరిగితే… బీజేపీ శాసనససభా పక్ష నేతగా ఈటల రాజేందర్‌ వ్యవహరిస్తారా… లెట్స్‌ వెయిడ్‌ అండ్‌ సీ.