Off The Record : మున్సిపల్ ఫలితాలు పొలిటికల్ బ్రదర్స్ ని ఇరుకున పెట్టాయా?
- మున్సిపల్ ఫలితాలు పొలిటికల్ బ్రదర్స్‌ని ఇరుకున పెట్టాయా?
- కరీంనగర్లో సత్తా చాటలేకపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
- చివరి మూడు రోజులు అక్కడే ఉన్నా నో యూజ్
- కరీంనగర్లో 14 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఇద్దరు రాజకీయ సోదరులకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చినట్టేనా? ఒక మంత్రి, పార్టీ పరంగా అత్యున్నత స్థానంలో ఉన్న నేత తాము ప్రతిష్టాత్మకంగా భావించిన చోట సత్తా చాటలేకపోయారా? సొంత బలంతో సీట్లో కూర్చోలేక మిత్రులతో మంతనాలు జరుపుతున్న ఆ నాయకులు ఎవరు? అక్కడైనా వారు సత్తా చాటతారా? కాంగ్రెస్ పార్టీలో పరపతి పెంచుకుంటారా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరూ పొలిటికల్ బ్రదర్స్. కలిసి మెలిసి పని చేస్తుంటారు. ఒకే సామాజికవర్గం కావడం ఇంకాస్త ప్లస్ అయి అలయ్ బలయ్ అన్నట్టుగా ఉంటుంది ఆ బంధం. అయితే… ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు ఈ రాజకీయ సోదరులిద్దర్నీ ఇరుకున పడేశాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకరకంగా సవాల్ విసిరాయంటున్నారు. ఇద్దరిలో ఒకరు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే…. మరొకరు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. పొన్నం తన సొంత నియోజక వర్గం.. హుస్నాబాద్ లో మంచి ఫలితాలే సాధించారు. కానీ….ప్రతిష్టాత్మకంగా భావించిన కరీంనగర్‌లోనే బోల్తా కొట్టింది వ్యవహారం. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్‌లో తనకున్న పరిచయాలతో చివరి మూడు నాలుగు రోజులు అక్కడే ప్రచారం నిర్వహించారు మంత్రి. అలాగే… కరీంనగర్ కార్పొరేషన్‌ను గెలిచేందుకు.. శాయశక్తులా ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కానీ… ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
సొంతగా మేయర్ సీట్లో కూర్చునే పరిస్థితి లేదు. బీజేపీ సెంటిమెంట్ ముందు హస్తం ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అవక కేవలం 14 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మైనస్సేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మేజిక్ ఫిగర్‌కు మూడు సీట్ల దూరంలోకి వచ్చి బీజేపీ ఆగితే… అధికార పార్టీగా కాంగ్రెస్ ఆ దరిదాపుల్లో కూడా లేకపోవడాన్ని ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే…. సొంత జిల్లా నిజామాబాద్ మీద, అందులోనూ ఈ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఎక్కువ ఫోకస్ చేశారు. తన సొంత మున్సిపాలిటీ బింగల్లో అయితే కాంగ్రెస్ జెండా ఎగరేయగలిగారుగానీ….అత్యంత కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్లో మెజార్టీ సాధించలేక పోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లాలో కీలకమైన మున్సిపాలిటీలో మేయర్ సీటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ సాధించలేకపోవడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరమేనన్న వాదన బలపడుతోంది. అయితే…. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేసే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక్కడ కాంగ్రెస్‌కు 14, ఎంఐఎంకు 17 సీట్లు వచ్చాయి. BRS తరపున ఒకే ఒక్క కార్పొరేటర్ గెలిచారు. అటు బీజేపీ సింగిల్‌గా 28 డివిజన్స్ గెలుచుకుంది. దీంతో… కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పాలక మండలి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. మహేష్‌గౌడ్ ఇప్పటికే ఎంఎం పెద్దల్ని సంప్రదించగా… ఇద్దరూ కలిసి నిజామాబాద్‌లో కాషాయ జెండా ఎగరకుండా చూడాలనుకుంటున్నట్టు సమాచారం. అటు బీఆర్ఎస్ ఒక్క సభ్యుడితో పాటు కాంగ్రెస్ మెంబర్స్ క్యాంప్‌కు వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్సీగా తన ఎక్స్ అఫిషియో ఓటు.. కూడా నిజామాబాద్‌లోనే నమోదు చేసుకున్నారు మహేష్‌గౌడ్. ఇలా…వోవరాల్‌గా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి బీజేపీకి చెక్‌పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?