Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record New Faction History In Anantapur Politics

అనంత ఫ్యాక్షన్, రాజకీయ కక్షల్లో కొత్త చరిత్ర..!

Published Date :November 26, 2021 , 5:58 pm
By Manohar
అనంత ఫ్యాక్షన్, రాజకీయ కక్షల్లో కొత్త చరిత్ర..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వంద అడుగుల్లో నీరు పడుతుందంటే.. 99 అడుగులు తవ్వాక పనులు ఆపేస్తే ఎలా? ఇన్ని రోజులూ ఫ్యాక్షన్, రాజకీయ కక్షలు రూపుమాపేందుకు చేసిన ప్రయత్నం ఇలాంటిదే. మిగిలిన ఆ ఒక్క అడుగు తవ్వాలి. అందుకే తాను వచ్చానంటున్నారా? ఆ యువనేతది ఇదే ఆలోచనా? మార్పు మొదలైందా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా?

అప్పట్లో జేసీ.. పరిటాల కుటుంబాల మధ్య రాజకీయ వైరం..!

ఫ్యాక్షన్‌కు పుట్టినిల్లులాంటి అనంతపురం జిల్లాలో రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం ఉంది. అందులో ఒకటి పరిటాల కుటుంబం. రెండోది జేసీ ఫ్యామిలీ. రెండు కుటుంబాలదీ ఒకే జిల్లానే అయినా.. వారి రాజకీయాలు, వ్యవహారాలు సాగించేది వేరు వేరు ప్రాంతాల్లో. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. గతంలో వేర్వేరు. పరిటాల రవి టీడీపీని తన కనుసన్నల్లో నడిపిస్తే.. కాంగ్రెస్‌ పార్టీలో జేసీ బ్రదర్స్‌ది వన్‌మెన్‌ షో. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయినప్పటికీ జిల్లాను జేసీ దివాకర్‌రెడ్డి లీడ్‌ చేసేవారు. ఈ క్రమంలోనే పరిటాల రవి.. జేసీల మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. అంతేతప్ప రెండు కుటుంబాల మధ్య కొట్టుకోవడాలు.. చంపుకోవడాలు లేవు. కాకపోతే రాజకీయ వైరం ముదురు పాకాన పడింది.

టీడీపీలోనే ఉన్నా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు..!

రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి వచ్చారు. బద్ద శత్రువులైన పరిటాల, జేసీలు ఒకే పార్టీలో ఉండటం చాలా మందికి మింగుడు పడలేదు. జేసీ హాజరైన వేదికలపైకి పరిటాల సునీత వచ్చినా ఏ రోజు పలుకరించుకోలేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి సైడై వారి కుమారులను రంగంలోకి దించారు. ఇటు సునీతతోపాటు ఆమె తనయుడు శ్రీరామ్ యాక్టివ్ అయ్యారు.

ఫ్యాక్షన్‌ సినిమా ఎండింగ్‌లో ఉండే సీన్‌లు కనిపిస్తున్నాయా?

కాలం మారింది. పగలు.. కక్షలు తగ్గాయి. యువ నాయకులు ఎంట్రీతో పాతవన్నీ పక్కన పెట్టి శ్రీరామ్, జేసీ కుమారులు పవన్, అస్మిత్‌లు కలిశారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు కూడా. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దీనికంటే ఆశ్చర్యం ఏంటంటే.. ఇటీవల లోకేష్ జిల్లా పర్యటనలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పరిటాల శ్రీరామ్ కలవడం. ఆలింగనాలు.. నవ్వులు పువ్వులు ఇలా ఒకటేంటి.. ఫ్యాక్షన్ సినిమా ఎండింగ్‌లో ఉండే సీన్‌లు కనిపించాయి. రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

తోపుదుర్తి చందు.. పరిటాల శ్రీరామ్‌ ఆత్మీయ పలకరింపులు..!

ప్రస్తుతం పరిటాల కుటుంబానికి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులతో రాజకీయ శతృత్వం ఉంది. వీరి మధ్య ఫ్యాక్షన్ గొడవలేమి లేకపోయినా.. అంతకుమించిన రాజకీయ వైరం ఉంది. నాలుగు రోజుల క్రితం వరదల్లో 10 మంది చెన్నేకొత్తపల్లి వద్ద నీటిలో చిక్కుకపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ వచ్చింది. ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు అక్కడికి వచ్చారు. అదేటైమ్‌లో పరిటాల శ్రీరామ్‌ కూడా రావడంతో ఇద్దరూ ఎదురెదురై ఒకర్నొకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా భుజాలు భుజాలు కలుస్తూ ముందుకు నడిచారు. ఈసమయంలో అక్కడ ఈలలు, కేకలు మామూలుగా లేవు. ఇలా వరస పరిణామాలు చూస్తే మార్పు మొదలైందా అంటే.. అవుననే అనుకుంటున్నారట అక్కడి జనం.

రాజకీయ వైరం వేరు.. ఫ్యాక్షన్‌ వేరు..!

కొత్తతరం నుంచి వచ్చిన శ్రీరామ్.. వందో అడుగు వేస్తున్నారా? అసలు ఎప్పటికీ కలవవు అనుకున్న జేసీ, పరిటాల కుటుంబాలు కలవడం ఏంటి? ఆప్యాయంగా కౌగిలింతలతో మాట్లాడుకోవడం ఏంటి? ఇప్పటికీ పచ్చగడ్డివేస్తే భగ్గుమనే తోపుదుర్తి సోదరులతో మాటలు కలపడం ఏంటి? అనంత ఫ్యాక్షన్ చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అయితే ఇవి ఇక్కడితో ఆగుతాయా? లేక మరింత ముందుకు వెళ్తాయో చూడాలి. రాజకీయ వైరం ఉండటం వేరు.. ఫ్యాక్షన్‌ వేరు. ఫ్యాక్షన్‌ను ఎవరూ కోరుకోరు. మరి.. ఈ ఫ్యామిలీలు రాజకీయ వైరం వరకే పరిమితం అయితే.. ఆ సీన్‌ వేరు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • Anantapur Politics
  • New Faction History
  • tdp

తాజావార్తలు

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

  • Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • 5-states elections: బెంగాల్ సహా 5-రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు ఖరారు, ఈ రోజు ప్రకటన.!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions