Site icon NTV Telugu

Off The Record: వార్ లో జూనియర్ కొండా!

Wgl

Wgl

Off The Record: ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పటికే హై ఓల్టేజి పాలిటిక్స్‌ నడుస్తుండగా ఇక ట్రాన్స్‌ఫార్మర్స్‌ పేలబోతున్నాయా? కొండా దంపతులు వర్సెస్‌ అదర్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌గా సాగుతున్న యుద్ధంలోకి కొత్త కేరక్టర్‌ ఎంటర్‌ కాబోతోందా? ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌తో అల్రెడీ ఉన్న మంటలో పెట్రోల్‌ పోసినట్టయిందా? నేనొస్తున్నా… అక్కడ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిని నేనేనంటూ మెసేజ్‌ పెట్టి మంటలు రేపిన ఆ వ్యక్తి ఎవరు? ఓరుగల్లు కాంగ్రెస్‌ పోరు ఏ టర్న్‌ తీసుకోబోతోంది?

Read Also: Off The Record: అరెరె.. ఛాన్స్ మిస్సయిందే..!

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్‌తో లోకల్‌ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొండా సురేఖ, మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే… కొండా కుమార్తె సుస్మితా పటేల్‌ వ్యక్తిగత ఇన్‌స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పరెంట్ అంటూ పెట్టిన పోస్ట్‌ కాకరేపుతోంది. అసలు కొండా మురళి దంపతులకు, జిల్లా కాంగ్రెస్‌ నేతలకు మధ్య గ్యాప్‌నకు కారణమే పరకాల నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి… తన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారంటూ మురళి సీరియస్‌ అయ్యాక పరిణామాలు చకచకా మారిపోయాయి. కొండా వర్సెస్‌ అదర్స్‌ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక, ఈనెల 19న రాహుల్‌ గాంధీ బర్త్‌ డే వేడుకల సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుల్ని ఉద్దేశించి మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Read Also: Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్‌.. వైఎస్‌ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

అంతేకాకుండా అదే రోజున.. పది రోజుల్లో తన కూతురు సుస్మితా పటేల్‌ వస్తుంది. ఇక, నుంచి పరకాల కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందంటూ ప్రకటించారాయన. ఒకవైపు మురళికి వ్యతిరేకంగా ఈ వివాదం కొనసాగుతుండగానే.. నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ సుస్మిత ఎంట్రీ ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో మరింత హీట్‌ పెంచింది. పరకాల టికెట్‌ని ఆశిస్తున్నానంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుస్మిత పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని సుస్మిత అధికారికంగా ప్రకటించినట్టయింది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య ఇప్పటికే తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సుస్మిత ఇన్‌స్టా పోస్ట్‌పై మండిపడుతున్నారట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి. 2009, 2012, 2018 ఎన్నికల్లో పరకాల సెగ్మెంట్‌లో పోటీ చేశారు సురేఖ. 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యత స్వీకరించారామె.ఆ తర్వాత మారిన పరిణామాలతో ఆమె వైఎస్ఆర్సిపిలో చేరి మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇక, 2012 ఉప ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయారు. 2018లో కూడా పరకాల నుంచి పోటీ చేసి ధర్మారెడ్డి చేతులో ఓటమి పాలయ్యారు కొండా.గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. పరకాల సెగ్మెంట్‌లో తాము మద్దతు ఇస్తేనే రేవూరి గెలిచారంటూ ఇప్పటికీ పదే పదే అంటుంటారు కొండా మురళి. ఇలాంటి వాతావరణంలో… పరకాల సెగ్మెంట్‌ తమదే అన్నట్లుగా సుస్మిత పోస్ట్‌ పెట్టడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారట రేవూరి ప్రకాశ్‌రెడ్డి. ఆరు నూరైనా… వచ్చే ఎన్నికల్లో… పరకాల నుంచి తాను పోటీచేయడం ఖాయమంటూ సంకేతాలు ఇస్తున్నారు సుస్మిత. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సుస్మిత త్వరలోనే పరకాల సెగ్మెంట్‌లో తిరగబోతున్నట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న క్రమంలో… తన టికెట్‌కు ఎలాంటి ఢోకా ఉండబోదని, తన రాకను చూసి ప్రత్యర్ధులు భయపడాల్సిన అవసరంలేదంటున్నారట సస్మితా పటేల్‌. ఇప్పటికే జిల్లాలో కొండా దంపతులు వర్సెస్‌ ఇతర కాంగ్రెస్‌ నేతలు అన్నట్టుగా ఉంది. ఈ పరిస్థితుల్లో వారసురాలి ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version