NTV Telugu Site icon

Munugode By Election : మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతోందా..?

Munugode Trs

Munugode Trs

మునుగోడు అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసిందా?పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలలో ఏ నేతకు జనం పట్టం కట్టారు?ఆశావహులను బుజ్జగించి…మునుగోడు అభ్యర్థిని టిఆర్ఎస్ ప్రకటించబోతోందా?

మునుగోడు బై ఎలక్షన్‌పై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కసరత్తు దాదాపు పూర్తి చేసిందట గులాబీ పార్టీ. పలువురి పేర్లను అభ్యర్థులుగా పెట్టి సర్వేలు చేయించి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో వారికున్న ఇమేజ్‌పై ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మునుగోడు బై ఎలక్షన్‌కు అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలతో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశం ఉందట.

మునుగోడు అభ్యర్థి ఎంపికపై పలు రకాలుగా నివేదికలు తెప్పించుకుంది టిఆర్ఎస్. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ పేర్లతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వేలు చేయించిందని సమాచారం. టిఆర్ఎస్ చేయించిన సర్వేలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డివైపే జనం మొగ్గు చూపారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత నియోజకవర్గం వదలకుండా కూసుకుంట్ల పర్యటనలు చేయడం ఆయనకు కలిసి వచ్చిందట.ఇటు నియోజకవర్గ ప్రజలకు కూసుకుంట్ల తెలిసిన ఫేస్‌గా తేలిందట. ఇటు పార్టీ అధిష్టానం కూసుకుంట్ల విషయంలో సానుకూలంగా ఉందని టాక్‌. దీంతో ఆశావహుల బుజ్జగింపులు పూర్తయిన తర్వాత మునుగోడు అభ్యర్థిని టిఆర్ఎస్ ప్రకటించేందుకు సిద్ధం అవుతుందట.

ఇప్పటికే పోటీకి సిద్ధం కావాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిఆర్ఎస్ సంకేతాలు పంపిందట. దీంతో మునుగోడు అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది.

మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతోందా..? Off The Record | NTV