Ellareddy Politics: వాళ్ళు వెనక్కి వచ్చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతా అధికారపార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు టెన్షన్ పట్టుకుందట. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. వారొస్తే తన పరిస్థితి ఏంటనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. అది ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎమ్మెల్యే సురేందర్‌లో గుబులు?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ను వీడి వెళ్లిన పలువురు నేతలు.. తిరిగి వచ్చేస్తారన్నది ఆ ప్రచార సారాంశం. దీంతో లోకల్ ఎమ్మెల్యే జాజల సురేందర్‌లో గుబులు మొదలైందని చెబుతున్నారు.
Also Read
ఈటలతో కలిసి బీజేపీలోకి వెళ్లిన రవీందర్‌రెడ్డి
ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అడ్డా. 2009 నుంచి ఇక్కడ ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018లో మాత్రం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జాజల సురేందర్ చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సురేందర్ గులాబీ గూటికి చేరుకోవడంతో ఇరకాటంలో పడ్డారు రవీందర్‌రెడ్డి. ఒకే ఒక్క ఓటమితో అధికారపార్టీలో గుర్తింపు పోయిందని భావించారో ఏమో రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరిపోయారు. అప్పట్లో ఈటలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరికొందరు సైతం కాషాయ కండువా కప్పుకొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రెబల్ అభ్యర్థి రవీందర్‌సింగ్ టీఆర్ఎస్కు ఘర్ వాపసీ కావడంతో కొత్త చర్చ షికారు చేస్తోంది. రవీందర్‌రెడ్డి మిగతా నాయకులు తిరిగి గులాబీ గూటికి వచ్చేస్తారని ప్రచారం జోరందుకుంది.
బీజేపీని వీడేది లేదంటున్న రవీందర్‌రెడ్డి
రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే సురేందర్‌తో పడేది కాదు. ఇద్దరూ అధికారపార్టీలో ఉన్నప్పటికీ ఎవరి వర్గం వారిదే. ఎమ్మెల్యే మాటే ఫైనల్ కావడంతో జీర్ణించుకోలేకపోయేవారు రవీందర్‌రెడ్డి. పార్టీ పెద్దల అండతో సురేందర్ ఏదో నెట్టుకొచ్చినా.. తాజా ప్రచారం మాత్రం ఎమ్మెల్యేకు కునుకు లేకుండా చేస్తోందట. రవీందర్‌రెడ్డి తిరిగొస్తే తన పరిస్థితి ఏంటనే టెన్షన్లో ఉన్నారట. ఎమ్మెల్యే బాధ ఇలా ఉంటే.. జరుగుతున్న ప్రచారంపై రవీందర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారట. తాను బీజేపీని వీడే పరిస్థితే లేదని అనుచరులకు తేల్చి చెబుతున్నారట మాజీ ఎమ్మెల్యే. కావాలనే ప్రత్యర్థులు ఈ ప్రచారం తీసుకొచ్చారని.. ఇదో పెద్ద కుట్రగా ఆయన అనుమానిస్తున్నారట.
కేడర్‌లో సందేహాలు అలాగే ఉన్నాయా?
రవీందర్‌రెడ్డి ఎంత చెప్పినా.. ఎన్ని వివరణలు ఇచ్చినా.. ఆయన కేడర్‌లో మాత్రం కొన్ని సందేహాలు అలాగే ఉన్నాయట. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని.. రవీందర్రెడ్డినే నమ్ముకున్న తమ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో అని అనుచరులు ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి ఒక ప్రచారం..అటు ఎమ్మెల్యేలోనూ… ఇటు మాజీ ఎమ్మెల్యే శిబిరంలోనూ పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. ఎల్లారెడ్డి రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!