Leaders Silence: ఈ మౌనానికి అర్థమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్‌లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుపై హిందూపురంలో పెద్దఉద్యమమే జరుగుతోంది. జిల్లాలో అనంతపురం తర్వాత పెద్ద పట్టణమైన హిందూపురాన్ని కాకుండా మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ఎలా చేస్తారని ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో రెండురోజులపాటు జిల్లాలో రచ్చ రచ్చ అయింది. వాస్తవంగా జిల్లాల విభజన ప్రతిపాదన వచ్చాక ముందుగా వినిపించిన పేరు పెనుకొండ. అన్ని ప్రాంతాలకు సమానమైన దూరం, గొల్లపల్లి రిజర్వాయర్, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండటం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టణం కావడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ప్రకటించాలని ఉద్యమం జరిగింది. కరోనా కారణంగా కాస్త సైడ్ అయినా.. మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండ అంశమే ప్రధాన ప్రచారాస్త్రమైంది.
..spot..
పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలన్న వాళ్లు నోరు మెదపడం లేదు
పెనుకొండ మంత్రి శంకర్‌నారాయణ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తామని ఆయన హామీలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా ఇదే అంశాన్ని చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇదే హామీతో మంత్రి శంకర్‌నారాయణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపించారు కూడా. అయితే జిల్లా కేంద్రం పెనుకొండ కాకుండా పుట్టపర్తికి వెళ్లింది. ఈ అంశంపై హిందూపురంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంటే.. నిన్న మొన్నటి వరకు పెనుకొండ కోసం పట్టుబట్టిన వాళ్లు మాత్రం నోరు మెదపడం లేదు. ఏడాది క్రితం పెనుకొండ జిల్లా సాధన సమితి కూడా ఏర్పటైంది. జిల్లా కేంద్రం తమ ఆకాంక్ష అని..చివరి వరకు పోరాటం చేసినా సాధ్యం కాలేదని మంత్రి చేతులు ఎత్తేశారు. తనవల్ల కానిది అవుతుందని చెప్పడం కంటే హ్యాండ్సప్ బెటర్ అనుకున్నట్టున్నారు మంత్రి.
బాలయ్య ఎంట్రీతో పార్థసారథి సైలెంట్
అయితే జనం నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న మంత్రి శంకర నారాయణే ఇలా స్పందిస్తుంటే.. ఈ విషయంలో అధికారపార్టీని కార్నర్ చేయాల్సిన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అస్సలు నోరు విప్పడం లేదు. ఆయన కొన్నేళ్లుగా పెనుకొండ నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంపై సైలెంట్ అయ్యారు. దానికీ బలమైన కారణం లేకపోలేదు. పార్థసారథి ప్రస్తుతం టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓపక్క హిందూపురం కోసం బాలయ్య రంగంలోకి దిగడంతో పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని అడిగితే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు పుట్టపర్తి, కదిరి, మడకశిక ప్రాంత వాసులు దానిని తీవ్రంగా తప్పుపట్టి, వ్యతిరేకించే అవకాశం ఉండటంతో ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిందా?
మొత్తంమీద ఎవరూ ఊహించని సమయంలో జిల్లా విభజన తీసుకొచ్చి.. టీడీపీని ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి సీఎం జగన్ పడేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. పైకి నవ్వుతూ కనిపించినా.. నాలుగు గోడల మధ్య తమ రాజకీయ భవిష్యత్‌ను తలచుకుని టెన్షన్ పడుతున్నారట. మరి.. ఈ సమస్య నుంచి పెనుకొండ నేతలు ఎలా బయటపడతారో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!