Kothagudem TRS : తెలంగాణ కొత్తగూడెంలో రసవత్తరంగా వనమా వర్సెస్ జలగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kothagudem TRS : ఆ మధ్య రాజకీయంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కష్టమనే చర్చ సాగింది. ఇంతలో మాజీ MLA కదలికలు పెరిగాయి. కొత్త సమీకరణాలు చర్చకు వస్తున్న తరుణంలో.. గేర్ మార్చేశారు సిట్టింగ్ MLA. ఎందుకలా? తాజా.. మాజీల మధ్య అసలేం జరుగుతోంది? ఎవరు వారు? లెట్స్వాచ్..!
వనమా వెంకటేశ్వరరావు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఎమ్మెల్యే. వయసు పైబడి.. ఆ మధ్య వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని డీలా పడిన ఆయనకు.. కుమారుడు రాఘవేంద్ర రూపంలో రాజకీయంగా పెద్ద ఝలక్ తగిలింది. రాజకీయంగా వనమా పరిస్థితి అయిపోయిందని అంతా భావించారు. ఎమ్మెల్యేగా కూడా ఎక్కడా పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో.. పొలిటికల్ మూడ్‌ను అర్థం చేసుకున్నారని అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ.. వనమా గేర్ మార్చేశారు. గతంలో కంటే చలాకీగా కొత్తగూడెంలో పర్యటనలు చేస్తున్నారు. ఎక్కువగా జనంలో ఉండటానికే ఇష్ట పడుతున్నారు. అంతేనా.. వచ్చే ఎన్నికల్లో కొత్తూగూడెంలో టీఆర్ఎస్ నుంచే తానే పోటీ చేస్తానని కుండబద్దలు కొడుతున్నారు కూడా. కొత్తగూడెం బరాబర్ తనదే అన్నది వనమా వెంకటేశ్వరరావు మాట. అదే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చగా మారింది.
Also Read
2014లో ఇదే కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు జలగం వెంకట్రావు. 2018లో ఆయన వనమా చేతిలో ఓడిపోయారు. వనమా టీఆర్ఎస్లో చేరాక జలగం సైలెంట్ అయ్యారు. అయితే వనమాపై జలగం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2014లో వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌కు.. 2018లో సమర్పించిన అఫిడవిట్‌కు తేడా ఉందనేది జలగం ఆరోపణ. ఆస్తులను సరిగా వెల్లడించలేదని మండిపడుతున్నారు. దానిపైనే ఆయన కోర్టుకు వెళ్లారు. వనమాపై అనర్హత వేటు పడుతుందనే గట్టి ధీమాతో ఉంది జలగం వర్గం. దానికితోడు వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత జలగం వెంకట్రావు దూకుడు పెంచారు. అది ఎమ్మెల్యేకు రుచించడం లేదట. అందుకే ఈ ఐదేళ్లూ తానే ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని వనమా చెబుతున్నారని భావిస్తున్నారు. ఇది జలగంను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రకటనగా అభిప్రాయ పడుతున్నారట.
వచ్చే ఎన్నికల్లో వనమా పోటీ డౌట్ అని పార్టీ కేడర్ అనుకుంటున్న తరుణంలో.. ఇలా గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యేను చూసి శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అధిష్ఠానం ఆశీసులు ఉన్నాయనేది వనమా వాదన. కొత్తగూడెంలో రాజు, మంత్రి తానేనని చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలను.. టీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న జలగం తదితరులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. అందరి జాతకాలు పార్టీ పెద్దల దగ్గర ఉన్నాయని.. కొత్తగూడెంలో మార్పు అనివార్యమని భావిస్తున్నారట. దీంతో అధికార పార్టీలోని రెండు వర్గాలు వేస్తున్న ఎత్తుగడలు నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి.. ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో.. ఎవరు బరిలో ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Devdutt Padikkal: భారత్ కష్టాల్లో పడేది.. మా టార్గెట్ అదే.. పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
-
Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!