OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
- వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..
- కేంద్రం నుంచి ఏం వచ్చినా పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేలా యాక్షన్..
- నషాముక్త్ భారత్ నినాదంతో తాజాగా పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇక తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో మరింత కీలకం కావాలనుకుంటున్నారా? ఫుల్లీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసి దూకుడు పెంచబోతున్నారా? పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి సంబంధించి ఏ కీలక నిర్ణయం తీసుకున్నా… తనను దాటి పోకుండా ప్లాన్ చేసుకుంటున్నారా? అధిష్టానం స్టేట్ మీద ఫోకస్ పెంచిన క్రమంలో అధికారంలోకి తీసుకురావడానికి తన పాత్ర పోషిస్తున్నారా? నషాముక్త్ యాత్ర చుట్టూ జరుగుతున్న చర్చలేంటి?
బీజేపీ సీనియర్ లీడర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. సాఫ్ట్‌గానే… ఆయన వేసే పొలిటికల్ స్టెప్స్ ప్రత్యర్థుల ఊహకు అందవని అంటుంటారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే… కొంత కాలంగా ఆయన అదే తరహా వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది పొలిటికల్ ఒపీనియన్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏదైనా ఇవ్వబోతోందన్న సమాచారం ఉంటేచాలు… ముందే అలర్ట్ అయిపోయి… అది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా చూస్తున్నారాయన. తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినప్పుడు ఆ ఏరియాలో రెండు రోజుల యాత్ర చేశారాయన. ఇక బీజేపీ దేశ వ్యాప్తంగా సేవ్ డెమోక్రసీ, రిమూవ్ anarchy నినాదంతో పాదయాత్రలు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన మహా పాదయాత్రకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర మొదలుపెట్టారు.
Also Read
- Off The Record: 'ఎవర్రా వీళ్లంతా..?' అంటూ జనసైనికుల ఫైర్
- Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
- OTR: మానుకోట కాంగ్రెస్‌లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
- OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ఇప్పుడాయన ఎంచుకున్నది నషా ముక్త భారత్ నినాదం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు కిషన్‌రెడ్డి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే… ఇది డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, యువతలో చైతన్యం తీసుకుని రావడానికేనని, రాజకీయాలకు అతీతం అని కూడా ప్రకటించారు. అదే సమయంలో తన యాత్రకు బీజేపీ మద్దతివ్వాలని కోరడంలోనే వ్యూహమంతా దాగి ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాలకు అతీతం అని ప్రకటించడం ద్వారా అన్ని వర్గాల మద్దతు కోరుతున్నారు కిషన్. అదే సమయంలో పరోక్షంగా బీజేపీని ఇన్వాల్వ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నషా ముక్త్ యాత్రలో భాగంగా…ఆయన వెళ్తున్న మార్గంలో ఉన్న స్కూల్స్, కాలేజీల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. అలాగే… సినీ ప్రముఖులను, క్రీడాకారులు, విద్యా వేత్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కేంద్ర మంత్రి.
రాజకీయేతర వర్గాలను కూడా కలుపుకుని పోతూ… అన్ని సెక్షన్స్‌లో తనకు సానుకూలతను పెంచుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. నషాముక్త్ యాత్ర కూడా నామ్ కే వాస్తే గా కాకుండా ప్రణాళిక బద్ధంగా సాగుతోంది. ఇది సామాజిక కార్యక్రమంలా కనిపిస్తున్నా…. రాజకీయ ప్రయోజనం తప్పకుండా ఉండి ఉంటుందన్నది కొందరి మాట. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ లాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని… రాబోయే రోజుల్లో… రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కిషన్ భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకే వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్యనే ఉండాలని ఆయన భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ యాత్రవల్ల ఇటు వ్యక్తిగతంగా కిషన్ రెడ్డికి, అటు పార్టీగా బీజేపీకి లబ్ది చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. స్టేట్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో ఇది కూడా ఒక భాగం అన్నది కొందరి కేలిక్యులేషన్.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్
-
Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
-
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!