లెక్క ఎక్కువైనా ఫర్లేదు… తగ్గకుండా చూస్కో…. క్యాస్ట్‌తో కొడదాం. కులాల వారీగా ఎంత మంది వీలైతే అంత మంది మంత్రుల్ని దించుదాం. కానీ… కేలిక్యులేషన్స్ మాత్రం తేడా రాకూడదని ఆ మున్సిపాలిటీ విషయంలో కూటమి నేతలు భావిస్తున్నారా? మేయర్ సీటు జనసేన కోటాలో ఉన్నా…. తామే బరిలో ఉన్నట్టు టీడీపీ నాయకులు ఫీలవుతున్నారా? కలిపి కుమ్మేద్దాం… డబుల్ రివెంజ్ తీర్చుకుందామని అంటోంది ఎక్కడ? ఏంటి… అక్కడి స్పెషల్.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 26న ఎన్నికలు జరుగుతాయి. మేయర్ అభ్యర్థిగా జన,ేన తరపున ఆకుల భవాని బరిలో ఉన్నారు. వైసిపి తరపున సత్యశ్రీ పోటీ చేస్తున్నారు. అదంతా రొటీనే అయినా… కాస్త భిన్నంగా జరుగుతున్న కొత్త ప్రచారం మాత్రం లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి రేపుతోంది. సాధారణంగా… కూటమిలోని ఏ పార్టీ మేయర్ అభ్యర్థి బరిలో ఉంటే… ఆ పార్టీ తరపున లీడ్ తీసుకుంటూ ఉంటారు. కానీ… ఈసారి కాకినాడలో మాత్రం వాతావరణం కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మేయర్ సీటు జనసేన కోటాలో ఉన్నా…. టీడీపీనే మొత్తం మీదేసుకుని పని చేస్తోందట. ఇంకా చెప్పాలంటే కాకినాడ మున్సిపాలిటీ కూటమికి వెరీవెరీ స్పెషల్ అయిందని అంటున్నారు.
ఈ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్స్ ఉండగా… ఓటర్ల సంఖ్య దాదాపు 2లక్షల 85వేలు. ఇందులో కాపులు 67 వేలు, అగ్నికుల క్షత్రియులు 51వేలు, మరో 31 వేల మంది వరకు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో… వైసీపీ శెట్టి బలిజకు అవకాశం ఇస్తే, కూటమి తరపున జనసేన మత్స్యకార మహిళకు అవకాశం కల్పించింది. దాంతో కార్పొరేషన్ రాజకీయం మొత్తం ప్రస్తుతం కులాల చుట్టూతే ఎక్కువగా తిరుగుతోందట. మొత్తం 66 డివిజన్స్‌కుగాను… 57 కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే… ఇప్పుడు బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వాలని గట్టిగానే వర్కౌట్ చేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకోసం గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నట్టు సమాచారం. దీంతో… కూటమి నాయకులు కూడా మరోసారి ఆయన లెక్కలు, ఎక్కాల్ని సరిచేయాలనుకుంటూ…. ద్వారంపూడి లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కాకినాడ పొలిటికల్ సర్కిల్స్‌లో దీని గురించే హాట్ హాట్‌గా డిస్కస్ చేసుకుంటున్నారు. ద్వారంపూడి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పరిధి దాటి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు టీడీపీ ముఖ్యుల మీద కూడా మాటల దాడి చేశారు మాజీ ఎమ్మెల్యే. దాంతో…జనసేనతో పాటు టీడీపీ పెద్దలు కూడా కాకినాడ మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలోనే… ఎమ్మెల్సీ నాగబాబు ఎప్పటికప్పుడు ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా అంతే సీరియస్‌గా తీసుకోవడంతో కాకినాడ మున్సిపల్ రాజకీయం రక్తి కడుతోంది. అందుకే… వీలైనంత ఎక్కువ మంది మంత్రుల్ని ఇక్కడ ప్రచార బరిలో మోహరించబోతున్నట్టు సమాచారం. కుల సమీకరణలు గట్టి పాత్ర పోషించే అవకాశం ఉన్నందున ప్రచార గడువు దగ్గర పడబోతున్న టైంలో… కులాల వారీగా మంత్రుల్ని దించాలనుకుంటున్నారట. కార్పొరేషన్‌లో ప్రభావవంతమైన కులాలకు చెందిన మంత్రులతో ప్రచారం చేయించి అన్ని రకాల ఈక్వేషన్స్‌ని సెట్ చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అలా చేస్తే… ఒకవైపు తమ కార్పొరేటర్ అభ్యర్థులకు సపోర్ట్ ఉంటుందని, మరోవైపు ద్వారంపూడి లెక్క కూడా సరి చేసినట్లు ఉంటుందని భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యే కొండబాబు గెలిచారు.
ఈసారి మేయర్ ఎన్నికల్లో మెజారిటీ అంతకంటే ఎక్కువ రావాలని పసుపు పార్టీ పెద్దలు టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే క్యాబినెట్‌లో ఉన్న కాపు, బీసీ మంత్రులతో ప్రత్యేకంగా క్యాంపెయిన్ టూర్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కులాలా వారీగా మంత్రులు వార్డుల్లో సుడిగాలి పర్యటనలతో హడావిడి చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా తగ్గేదేలే అంటున్నారట. ఫ్రష్ ఫేస్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించేసి న్యూ లుక్ కోసం వర్కౌట్ చేశారు. దీంతో…. పోలింగ్ టైం దగ్గరపడేకొద్దీ కాకినాడలో పొలిటికల్ హీట్ సాధారణంకంటే ఎక్కువగా పెరిగిపోతోంది. సీన్‌లో మంత్రులు ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుందన్నది కూటమి అంచనా. అందుకే మిగతా చోట్లకు భిన్నంగా కాకినాడలో టీడీపీ, జనసేన ఎవరికి వారే ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నారు. దీంతో… ఫైనల్ రిజల్ట్‌పై మిగతా చోట్లకంటే ఎక్కువగా ఇక్కడ ఉత్కంఠ పెరిగిపోతోంది.

