Junior Doctor Suicide: నంద్యాల జిల్లా సంత జుటూరు గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ గీతాంజలి దుర్మరణం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. నెల్లూరు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గీతాంజలి తండ్రి సంజీవ రాయుడు కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. పొలం పనులు చేస్తూ కష్టపడి కూతురిని చదివించారు. ఇటీవల దసరా సెలవుల కోసం గీతాంజలి స్వగ్రామానికి వచ్చి బంధుమిత్రులు, బాల్య స్నేహితులతో సంతోషంగా గడిపింది.
Read Also: Off The Record: వైసీపీ ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహం అమలు చేయబోతుందా?
అయితే, నిన్న రాత్రి తిరిగి కాలేజీకి వెళ్ళేందుకు సిద్ధమై బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమెను బస్సు ఎక్కించి వీడ్కోలు పలికిన తండ్రి సంజీవ రాయుడు, తెల్లవారుజామునే కూతురు మరణించిందనే వార్త విని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జూనియర్ డాక్టర్ గీతాంజలి ఆత్మహత్య న్యూస్ తెలిసిన వెంటనే సంజీవ రాయుడు, బంధుమిత్రులు నెల్లూరుకి బయలుదేరారు. సంత జుటూరు గ్రామంలో మాత్రం ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
