TDP: గత రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీది కీలకపాత్ర.. పరిస్థితులు మారడంతో అవమానంలో తమ్ముళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు. అందుకే టీడీపీ మద్దతు కావాలని ఏ పక్షమూ ఇంత వరకు అడగలేదని తెలుస్తోంది. పైగా హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ఉందట టడీపీ.
టీడీపీ వర్గాల్లోనే దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో రాష్ట్రపతి ఎన్నికలంటే టీడీపీ కీలక పాత్ర పోషించిన సందర్బాలు ఉన్నాయి. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. అలాంటిది ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ ఇలా ఎవ్వరూ చంద్రబాబును.. టీడీపీని పలకరించలేదు. గతంలో జాతీయస్థాయిలో చక్రం గిర్రున తిప్పిన స్థితి నుంచి అసలు మద్దతు కూడా కోరాల్సిన అవసరమే లేదనే రీతిలో జాతీయ స్థాయిలో టీడీపీ ఇమేజ్ పడిపోయిందని పార్టీ వర్గాలు నిట్టూరుస్తున్నాయి.
Also Read
గతంలో రాంనాధ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎంపీల మద్దతు కోరారు. ప్రస్తుతం అలా మద్దతు కోరే సంగతి దేవుడెరుగు.. అసలు ఏపీలో టీడీపీ అనే పార్టీ ఉందనే విషయాన్ని మరిచిపోయినట్టు జాతీయ పార్టీలు వ్యవహరించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యక్షంగా కాకున్నా.. కనీసం ఫోనైనా చేయకపోవడంపై పసుపు శిబిరాన్ని ఆందోళనలో పడేసిందట. గతంలో స్థానిక పరిస్థితులను వదిలేసి.. జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పాపానికి.. ఇప్పుడు రాష్ట్రంలోనూ.. జాతీయ స్థాయిలోనూ టీడీపీ అవమానాలను ఎదుర్కొంటుందనే చర్చ పార్టీలోనే ఉందట. వాస్తవాలను విస్మరించి.. శక్తికి మించిన అంచనాలతో ఏదేదో ఊహించుకుని రాజకీయం చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని కొందరు తెలుగు తమ్ముళ్లు దెప్పిపొడుస్తున్నారట.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!