NTV Telugu Site icon

Off The Record: నాగర్ కర్నూల్ జడ్పీ రాజకీయం

Maxresdefault (4)

Maxresdefault (4)

నాగర్‌కర్నూల్ జడ్జీ ఛైర్మన్‌ ఎన్నిక వెనుక ఎలాంటి రాజకీయం నడిచింది ? ఎంపీ తనయుడు ఛైర్మన్‌ కాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే ఎవరు ? ఇప్పుడా ఎంపీ తనయుడు ఏం చేస్తున్నారు ? ఎక్కడ కోల్పోయారో అక్కడే సాధించాలని…ఆ నేత కొత్త ప్లాన్‌ సిద్దం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు ?

నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ రాజకీయం రంజుగా సాగాయ్. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు వేసిన ఎత్తుగడలకు తండ్రీ కొడుకులు కుదేలయ్యారు. 2019లో జెడ్పీ చైర్పర్సన్‌ పదవి ఎస్సీ వర్గాలకు రిజర్వ్‌ చేశారు. దీంతో ఎంపీ రాములు… తన కొడుకు భరత్‌ను కల్వకుర్తి నుంచి పోటీచేయించి గెలిపించుకున్నారు. తర్వాత భరత్‌కే జిల్లా పరిషత్‌ పీఠమంటూ ప్రచారం జరిగింది. భరత్‌ పదవీ చేపట్టడం లాంఛనమనే అభిప్రాయం ఉండేది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌.. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డిల…పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తెల్కపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతిని… ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. .

జడ్పి చైర్ పర్సన్ గా ఎన్నికైన పద్మావతి తనకు ముగ్గురు సంతానం అనే విషయాన్ని దాచారంటూ ప్రత్యర్థి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్నిక రద్దయింది. ఇపుడైనా తనకు పదవి లభిస్తుందని ఆశపడ్డ భరత్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సారి ఊర్కొడ జడ్పిటిసి శాంత కుమారికి జడ్పి చైర్‌ పర్సన్‌ పదవి దక్కింది. దీంతో నాగర్‌కర్నూలు ఎంపీ రాములు వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తీవ్ర మనస్థాపం చెందిన భరత్…పదవికి రాజీనామా చేసి… పొగొట్టుకున్న చోటే వెతుక్కుంటానని ప్రటించారు. అచ్చంపేటలోనే తానేంటో నిరూపించుకుంటానంటూ ప్రకటించారు. నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తుండటంతో…టీఆర్ఎస్‌ రెండువర్గాలుగా చీలిపోయింది.

తన కుమారుడికి జడ్పీ ఛైర్మన్‌ పదవి రాకుండా అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజే అడ్డుకున్నారని ఎంపి రాములు అండ్ టీం ఆరోపిస్తోంది. జడ్పి చైర్మన్ ఎన్నిక రోజే గువ్వల బాలరాజుతో నీకేం అన్యాయం చేశానంటూ ఎంపి రాములు ప్రశ్నించారు. ఈ పరిణామం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ను షాకయ్యేలా చేసింది. అంతా భరత్‌కే అవకాశం ఉంటుందని భావిస్తున్న తరుణంలో…ఈ మార్పుపై పెద్ద రాజకీయమే నడిచినట్లు తెలుస్తోంది.

జడ్పీటీసి భరత్ దూకుడు…రెండోసారి కూడా చైర్మన్ పదవిని దూరం చేసిందని చర్చించుకుంటున్నారు . భరత్‌ జడ్పీ ఛైర్మన్‌ అయితే…భవిష్యత్‌లో అచ్చంపేట లో తనకు పోటీ ఉంటుందని గువ్వల బాలరాజ్‌ భావించారు. అందుకే ఇలా స్కెచ్ వేసారని చర్చించుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చట్టసభలకు పంపించడం కోసమే…జడ్పి చైర్మన్ అవకాశం ఇవ్వలేదేమో అని భరత్ వ్యాఖ్యానించడండతో అచ్చంపేట టిఆర్ఎస్‌లో కాక రేపుతోంది. టికెట్ దక్కక పోతే రెబల్‌గా అయినా బరిలోకి దిగడం ఖాయమని భరత్‌ టీం చెబుతోందట. ఈ పరిణామాలన్నీఅచ్చంపేట భవిష్యత్ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.