Site icon NTV Telugu

YCP : గన్నవరం వైసీపీలో ఆ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..?

Garam

Garam

గన్నవరం వైసీపీలో వేడి తగ్గటం లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య సెగలు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వంశీ. గత ఎన్నికల వరకు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన దుట్టా వర్గానికి వంశీ రాక ఇబ్బందిగా మారింది. 2014లో వంశీపై పోటీ చేసి దుట్టా 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. వచ్చే ఎన్నికలలో వంశీకి వైసీపీ టికెట్‌ ఖాయమైతే దుట్టా ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో గన్నవరంలో వర్గపోరు పీక్స్‌కు వెళ్లింది.

70 ఏళ్లు పైబడిన దుట్టా రామచంద్రరావుకు ఏడాది కిందటే ఎమ్మెల్సీ పదవిని సీఎం జగన్ ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. గన్నవరం బాధ్యతలు వంశీ చూసుకుంటారని పార్టీ పెద్దలు చెప్పినట్టు టాక్‌. అయితే ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరుతున్న దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారని చెబుతున్నారు. వంశీ సైడ్ అయితే మినహా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని.. దూకుడు పెంచేశారట. అయితే జగనన్న ఇళ్ల కోసం చేసిన భూసేకరణలో శివ భరత్‌రెడ్డి అక్రమాలకు పాల్పడి కోట్లు వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

వాస్తవానికి వంశీ వైసీపీకి జై కొట్టిన తర్వాత గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుతో రగడ నడిచింది. రెండు వర్గాలు సై అంటే సై అనుకున్నాయి. ఆ సమయంలో వంశీ, దుట్టా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇంతలో యార్లగడ్డకు డీసీసీబీ పదవి ఇచ్చింది పార్టీ. సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించినా.. ముదురు పాకాన పడింది. పార్టీ పెద్దలు సైతం పలుమార్లు సయోధ్యకు విఫలయత్నం చేశారు. చివరకు ఒక కార్యక్రమంలో సీఎం జగన్‌ స్వయంగా చొరవ తీసుకుని యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీల చేతులు కలిపి.. కలిసి సాగాలని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత యార్లగడ్డ సైలెంట్‌ అయిపోయారు. కానీ.. దుట్టా వర్గం వంశీకి రివర్స్‌ అయింది. వంశీ, దుట్టా శిబిరాలు ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

వీరిద్దరి మధ్య సయోధ్యకు రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు దుట్టా, వంశీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌ తర్వాత దుట్టా అస్సలు వెనక్కి తగ్గలేదు. వంశీతో కలిసి పనిచేసేది లేదని తేల్చేశారు.

బైట్- దుట్టా రామచంద్రరావు., వైసీపీ నేత

వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానంటున్నారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. YCP అభ్యర్థిని తానేనని తేల్చేశారు. అర్థంలేని ఆరోపణలపై స్పందించబోనని.. మూడు ఎన్నికలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే వంశీ.

బైట్‌.. వల్లభనేని వంశీ.. ఎమ్మెల్యే.

రెండు వర్గాలు వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో.. పార్టీ పెద్దలు గన్నవరం ఎపిసోడ్‌కు ఎలా ఎండ్‌కార్డు వేస్తారో చూడాలి.

Exit mobile version