Site icon NTV Telugu

Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు

Gadwal

Gadwal

Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్‌ సినిమా డైలాగ్‌ని గుర్తు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు. కాకుంటే సినిమా డైలాగ్‌ కుటుంబంలోని వాళ్ళ గురించి అయితే… ఇక్కడ మాత్రం సొంత పార్టీ వాళ్ళ గురించి. ఒకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని ఓడించడానికి పావులు కదుపుకుంటున్న పరిస్థితి ఎక్కడుంది? ఎందుకలా జరుగుతోంది?

Read Also: Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 7 ట్రిక్స్ పాటించండి చాలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, వనపర్తి నియోజకవర్గాల హస్తం పార్టీలో ఇప్పటికే వర్గ పోరు ఓ రేంజ్‌లో జరుగుతోంది. నియోజకవర్గంలో అప్పర్ హ్యాండ్ నాదంటే నాదే ఉండాలంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ… ఎప్పటికప్పుడు వ్యవహారాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు రెండు నియోజకవర్గాల్లోని గ్రూప్‌ లీడర్స్‌. దాంతో ఎప్పటికప్పడు అగ్గి చల్లారకుండా అంటుకుంటూనే ఉంది. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా… ఇప్పుడిక లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌ ఈ గ్రూప్‌ వార్‌ ఎక్కడ కొంప ముంచుతుందోనన్న కంగారు పెరుగుతోంది కేడర్‌లో. గద్వాల నియోజకవర్గాన్నే తీసుకుంటే… ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత తిరుపతయ్యగా జరుగుతోంది వర్గపోరు. రెండు గ్రూపుల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. అటు వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ కమిటీ వైస్ ఛైర్మన్‌ చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే స్థాయిలో వైరం కంటిన్యూ అవుతోంది.

Read Also: Rain Alert In AP: ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..

ఇలాంటి పరిస్థితుల్లో రెండు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, మద్దతు వంటి అంశాలు కాంగ్రెస్‌ నేతలకు కత్తి మీద సాములా మారిపోయాయట. ప్రధానంగా గద్వాలలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్దికి పోటీగా నియోజక వర్గ ఇన్ఛార్జ్‌ సరిత వర్గం అభ్యర్థి బరిలో ఉంటున్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందట. దీంతో… ప్రధాన పోటీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో కాకుండా… సొంత వాళ్ల మధ్యనే ఉంటోంది. ఈ రెండు వర్గాలు కొట్టుకుని చివరికి మెజార్టీ పంచాయతీల్ని ప్రతిపక్షానికి సమర్పించేసుకుంటే… పార్టీ పరువేం కావాలన్నది కార్యకర్తల కంగారు. వనపర్తి నియోజకవర్గంలోని వాతావరణం కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదట. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మేఘా రెడ్డి బలపరిచిన అభ్యర్దులకు పోటీగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సపోర్టర్స్‌ రంగంలో ఉన్నారు.

Read Also: AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే జీవోలో ఇద్దరు సీఎస్ల నియామకం..

ఇక్కడ కూడా… ఇద్దరు కాంగ్రెస్ నేతలు బలపరిచిన అభ్యర్థులు పోటీ పడితే.. బీఆర్ఎస్‌ లాభపడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండకపోవడంతోపాటు బీ ఫామ్ ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి… ఎవరికి వారు ఇష్టానుసారంగా తమ మద్దతుదారుల్ని పోటీకి దింపుతున్నారట. ఈ పరిస్థితి గనుక మారకుంటే… ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు బీఆర్‌ఎస్‌ లాభపడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు కాంగ్రెస్‌లోనే ఉన్నాయి. అదే సమంలో రేపు పార్టీ గుర్తుల మీద పోటీ జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో, రెబెల్స్‌ బెడద పార్టీని ఎంత డ్యామేజ్‌ చేస్తుందోనన్న కంగారు పెరుగుతోంది కాంగ్రెస్‌ కేడర్‌లో.

Exit mobile version