Kodela Sivaram : చంద్రబాబు దృష్టకి శివరామ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodela Sivaram : నిన్నటి వరకు ఆ నాయకుడు ఇంఛార్జ్ పదవి కోసం లాబీయింగ్ చేశారు. అధినేత మొదలుకొని పార్టీ నేతలు ఎవరూ కరుణించలేదు. తర్వాత చూద్దామన్నారే తప్ప భవిష్యత్‌పై భరోసా ఇవ్వలేదు. ఇంతలో రూటు మార్చి.. ప్లాన్ బీని బయటకు తీశారట ఆ నేత. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథా?
కోడెల శివరాం. దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవికోసం పార్టీలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కాకపోతే ఆయనది ఒంటరిపోరు. సత్తెనపల్లి టీడీపీ నేతలంతా ఒకవైపు.. ఆయన మరోవైపు అన్నట్టుగా ఉంది రాజకీయం. కోడెల కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు సైతం సత్తెనపల్లి ఇంఛార్జ్ పదవి ఇవ్వకపోవడంతో శివరాం నిరాశ చెందారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు తెరపైకి రావడంతో లోకల్ టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. చంద్రబాబు మాత్రం ఎవరినీ ఇంఛార్జ్‌గా ప్రకటించలేదు.
Also Read
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలే కోడెల శివరామ్‌కు ప్రతికూలంగా మారాయని ప్రచారం జరిగింది. ఆ మచ్చ ఇంకా తొలగకపోవడంతో శివరామ్ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అయినా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ మధ్య కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకు టీడీపీ నేతలను పిలిచారు. ఆ సభలోనే తన రాజకీయ జీవితానికి అంతా సాయం చేయాలని కోరారు శివరాం. అయితే కోడెల వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన వారెవరూ ఆయన కుమారుడికి సహకరించడం లేదట.
సత్తెనపల్లిలో పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు శివరాం ప్లాన్‌బీ అమలు చేస్తున్నట్టు సమాచారం. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా.. ఎదుర్కొంటానని శివరాం ప్రకటించారు. తనకు సహకరించవారందరికీ పరోక్షంగా చురకలు వేశారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశారు శివరాం. గెలిచినా.. ఓడినా.. కోడెల బిడ్డగా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. ఈ కామెంట్స్ సత్తెనపల్లి టీడీపీలో చర్చగా మారాయి. ఏ ధైర్యంతో శివరాం ఆ వ్యాఖ్యలు చేశారు? పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా ఇంఛార్జ్ పదవిని త్వరగా తేల్చాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోడెల కుటుంబానికి సన్నిహితంగా ఉండే కీలక నేత ద్వారా శివరాం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అందుకే బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన చాలా దీమాగా మాట్లాడినట్టు అభిప్రాయ పడుతున్నారు.
శివరాం వ్యాఖ్యలపై సత్తెనపల్లి టీడీపీలో కొందరు తప్పుపడుతున్నారు. ఒత్తిడి పాలిటిక్స్ వర్కవుట్ కావన్నది వారి వాదన. చంద్రబాబు దగ్గరకు ఆ విషయాన్ని తీసుకెళ్లారట. మరి.. సత్తెనపల్లి టికెట్ కోసం .. .ఇంఛార్జ్ పదవి దక్కేలా శివరాం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!