Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
- దేవరకద్ర నియోజకవర్గం పెద్దవాగు చుట్టూ రాజకీయం
- కాంగ్రెస్ వల్లే వాగు ఎండిందని బీఆర్ఎస్ పాదయాత్ర
- ముందు చూపులేకుండా ఎండబెట్టారంటున్న విపక్షం
- బీఆర్ఎస్ హయాంలో సాధ్యమైన నీటి తరలింపు ఇప్పుడేమైందని ప్రశ్న
- విపక్షానికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వర్గం కౌంటర్స్
- ప్రకృతి విపత్తు వస్తే రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శలు
- నాడు నల్లమట్టి అమ్మకం, చెక్‌డ్యామ్స్ నిర్మాణంలో అవినీతి అని ఆరోపణలు
- పెద్దవాగులో నీళ్ళకు బదులు పారుతున్న రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయ రచ్చకు పెద్ద వాగు కేంద్ర బిందువైంది. కృష్ణా జలాలు పారించాలని డిమాండ్ చేస్తూ… మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వట్టి పోయిన వాగులో పాదయాత్ర చేపట్టారు. మూసాపేట మండలం నిజాలపూర్ శివారు నుండి కందూరు వరకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నడవడం రాజకీయ రచ్చకు దారితీసింది. గతంలో తమ హయాంలో ఘనపురం బ్రాంచ్ కెనాల్ నుంచి పెద్ద వాగులోకి కృష్ణా జలాలు పారిస్తూ.. వాగుకు ఊపిరి పోశామని , దీంతో పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో భూగర్బ జలాలు కూడా పెరిగాయని, ఎలాంటి నీటి కష్టాలు లేకుండా రైతులు సాగు చేసేవారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రస్తుతం శ్రీశైలంలో నీళ్ళున్నాయి…కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు రన్ అవుతున్నప్పటికీ ..పెద్ద వాగుకు నీళ్ళు ఎందుకు రాలేదన్నది వాళ్ల ప్రశ్న.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ నేతలు ముందు చూపు లేని కారణంగా ఏర్పడ్డ దుస్థితి అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. వాగును ఎండబెట్టి ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు మాజీ శాసనసభ్యుడు. గత బీఆర్ఎస్ పాలనలో సాధ్యమైన నీటి తరలింపు.. ఇప్పుడెందుకు కావట్లేదని గులాబీ నాయకుడు గుస్సా చేయడం దేవరక్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. అయితే పెద్దవాగులో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన పాదయాత్ర , చేసిన విమర్శలకు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండ్ టీం గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఆల వెంకటేశ్వర్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదంటోంది ఎమ్మెల్యే వర్గం. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన కరువు పరిస్థితులను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతోంది. ప్రకృతి విపత్తును ఆసరాగా చేసుకొని రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని తప్పుబడుతున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
Also Read
ఇక ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా …జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు హామీలిచ్చి నెరవేర్చలేదంటు రివర్స్ పంచ్‌లు విసురుతున్నారు. అప్పట్లో చెరువుల్లో నల్లమట్టి అమ్ముకుని, చెక్ డ్యాంల నిర్మాణం మాటున అవినీతి చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జీయంఆర్. పెద్ద వాగులో జరిగిన రాజకీయ రచ్చ నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే… ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలన్నీ ఒక ఎపిసోడ్ మాత్రమేనని, అంతకు ముందు రాజకీయాన్ని దాటి పర్సనల్‌గా వెళ్ళిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. ఇక ఇదే సమయంలో ప్రతి సందర్భంలోనూ దేవరకద్ర నియోజకవర్గంలో రంజుగా మారుతున్న రాజకీయాన్ని గుర్తు చేస్తూ… అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరయ్యేకొద్దీ… ఇది ఇంరెలా మారుతుందోనంటూ ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!