Site icon NTV Telugu

Off The Record: కవిత విషయంలో ఇక దూకుడు పెరుగుతుందా ?.. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని డిసైడయ్యారా ?

Otr

Otr

Off The Record : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి బీఆర్‌ఎస్‌కు అస్సలు మింగుడు పడటం లేదట. పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా… ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి, గిచ్చి, సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలు ఉండటంతో పాటు…ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న కవిత…. అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్‌ఎస్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తయితే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయాక కు పుండు మీద కారం చల్లినట్టు ఎక్స్‌ మెసేజ్‌ పెట్టారామె. కర్మ హిట్స్‌ బ్యాక్‌ అంటూ…. ఎవరు చేసిన కర్మ వారికే తిరిగి కొడుతుందన్న అర్ధం వచ్చేలా ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా ఉందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు ఆ ట్వీట్‌ చూసిన కొందరు.

READ ALSO: Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సిద్ధం చేస్తోందా?

ఆ తర్వాత పార్టీలోని సీనియర్ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారామె. హరీష్‌రావు సహా… కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మాజీ మంత్రులను తీవ్రస్థాయిలో విమర్శించారు కవిత. దీంతో.. ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదని పార్టీ పెద్దలు డిసైడైనట్టు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే… మిగతా పార్టీలకంటే… కవిత చేసే డ్యామేజే ఎక్కువగా ఉందని భావిస్తున్నారట. ఆమె విషయంలో ఇక ఆగాల్సిన అవసరం లేదు, అటాక్‌ మోడ్‌ ఆన్‌ చేయండని బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. మొన్నటిదాకా అధినేత కూతురుగా, బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆమెతో ఉన్న అనుబంధం లాంటి రకరకాల కారణాలతో కవితపై మాట్లాడ్డానికి చాలామంది వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అధిష్టానం నుంచే క్లియరెన్స్‌ రావడంతో… పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక దూకుడు పెంచుతున్నారట. తాజాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలే మారిన వైఖరికి నిదర్శనం అంటున్నారు. ఇన్నాళ్లు కవిత ఏం మాట్లాడినా… ఆచితూచి స్పందించే నాయకులు తాజాగా మాత్రం

కారణజన్ముడి కడుపున రాక్షసి పుట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ముందు ముందు ఈ మాటల ఘాటు మరింత పెరుగుతుందని కూడా చెబుతున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఆమె అంటున్న మాటలు పార్టీని ఆ స్థాయిలో డ్యామేజ్‌ చేస్తున్నాయి కాబట్టి ఇక రివర్స్‌ అటాక్‌ తప్పదని గులాబీ పెద్దలు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కవిత పార్టీ నుంచి బయటికి పోవడం వల్ల పెద్దగా నష్టం జరగలేదుగానీ… వెళ్ళాక చేస్తున్న విమర్శలు , ఆరోపణలు మాత్రం బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి శూలాల్లా గుచ్చుకుంటూ గాయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి…ఇక ఎట్టి పరిస్థితుల్లో కవితను వదిలిపెట్టకూడదని డిసైడైనట్టు చెప్పుకుంటున్నారు. కవిత తన తండ్రి కేసిఆర్‌కు లేఖ రాసినప్పుడే కొంతమంది మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే అడ్డు చెప్పింది అధిష్టానం. ఆ తర్వాత కూడా కవిత పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేసినప్పుడు కూడా సైలెన్స్‌ సైలెన్స్‌
అంది. కానీ… ఇక ఇప్పుడు అట్నుంచి దాడి తీవ్రత పెరిగిపోవడంతో… సమాధానం చెప్పకుండా ఉపేక్షిస్తే.. డ్యామేజ్‌ పెరిగిపోతుందని భావిస్తున్నారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. అందుకే మీ ఇష్టం… మాట్లాడుకోండని నాయకులకు గ్రీన్ సిగల్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్‌ వర్సెస్‌ కవిత మాటల యుద్ధం ముందు ముందు ఇంకెంత హాట్‌ హాట్‌గా జరుగుతుందో చూడాలి.

READ ALSO: Off The Record : తీర్పు ఎలా ఉన్న స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ ..!

Exit mobile version