Site icon NTV Telugu

Off The Record: అయ్యన్నపాత్రుడి ఆలోచన అదేనా?

Ayanna

Ayanna

అయ్యన్న ఫుల్ పాపులరా ? కొడుకును ఎంపీగా పోటీచేయించేందుకు ప్రయత్నిస్తున్నారా ? | OTR | Ntv

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న…వరుస వివాదాలతో కేసుల మీద కేసులతో ప్రతిపక్షంలో ఉన్నా…బాగానే పాపులర్ అయ్యారు. సీనియర్ మోస్ట్ నేతగా గుర్తింపు ఉన్న అయ్యన్నకు పొలిటికల్ వారసుడు ఇవ్పటి వరకు లేరు, గతంలో ప్రయత్నిం చేసినా ఫలించలేదు. కొడుకును బరిలోకి నిలపడానికి…ఈ సారి గురి తప్పకూడదని గట్టి పట్టుదలతో ఉన్న అయ్యన్న…పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నారట. కొడుకును ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపడానికి…నిలిపిన తర్వాత గెలవడానికి ఎత్తులు వేస్తున్నారట.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం త్యాగాలు చేశారు అయ్యన్నపాత్రుడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు…సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. పార్టీతో వున్న అనుబంధం, బీసీ నాయకత్వం కలగలిసి వుండటంతో ఈ మాజీమంత్రి హైకమాండ్ ను డిమాండ్ చేయగలరు….ఎదిరించి సాధించుకోగలరనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో అయ్యన్న రికమండేషన్ సూపర్ పవర్ ఫుల్ అని నమ్ముతున్నారట కొందరు నేతలు. అదే సమయంలో అయ్యన్నకు ఓ టార్గెట్ ఉందట. కుమారుడు విజయ్ పాత్రుడిని ఎన్నికల బరిలోకి దించడం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయ్….గత ఎన్నికల సమయంలోనే పోటీకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఈ దఫా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని గట్టిపట్టుదలతో ఉన్నారట అయ్యన్న.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదిగిన ఎర్రన్నాయుడు, అయ్యన్నపాత్రుడు సమకాలీకులు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సక్సెస్ అయ్యారు. వైసీపీ ఎదురుగాలిని తట్టుకుని నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. విజయ్ పాత్రుడి విషయంలో ఆ అవకాశం ఇప్పటి వరకు లభించలేదనే అభిప్రాయం అయ్యన్న వర్గానికి ఉందట. అందుకే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయ్, నర్సీపట్నం నుంచి అయ్యన్న పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి కుమారుడి టిక్కెట్‍ విషయంలో అయ్యన్న రాజీపడరనే వాదన ఉంది. ఇక్కడి నుంచి కొత్త ఎత్తులు ప్రారంభమయ్యాయట. అటు పార్టీకి, ఇటు ఎంపీగా కుమారుడి విజయానికి కలిసొచ్చేలా ఉభయతారకమైన ఎత్తుగడలకు అయ్యన్న తెరలేపారనేది తాజా చర్చ. 2019ఎన్నికల తర్వాత నర్సీపట్నం, పెందుర్తి నియోజకవర్గాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది.

కీలకమైన యలమంచిలి,చోడవరం,మాడుగుల నియోజకవర్గాలు ఇన్చార్జుల చేతుల్లోనే వుండిపో యాయి. బలమైన కేడర్ వున్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటోంది. కొడుకు ఫ్యూచర్‌ కోసం ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారట అయ్యన్న. కొందరు మాజీ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల హామీలు ఇచ్చి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. పార్టీ అధి ష్టానం నిర్ణయించిన ఇన్చార్జుల స్ధానంలో త్వరలో అయ్యన్న టీమ్ వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. చోడవరంలో మాజీ ఎమ్మె ల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగులలో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు మద్దతుగా నిలుస్తున్నారట. రిజర్వ్డ్ స్ధానమైన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అయ్యన్న వర్గీయురాలనే ముద్ర ఉంది. మాడుగులలో ఇన్చార్జ్ పదవి కోసం గవిరెడ్డితో పాటు మరో ఇద్దరు పోటీపడ్డారు. ఇక్కడ పీవీజీ కుమార్‌తో పార్టీ కార్యక్రమాల చేస్తోంది. యలమంచిలిలో ప్రగడ నాగేశ్వరరావు ఇన్చార్జ్ గా వుండగా వచ్చే ఎన్నికల పోటీలో ఆయన ఎంత వరకు సమర్ధంగా ఎదుర్కోగలరు అనే అనుమానాలు ఉన్నాయట.

పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ కోసం అయ్యన్న ఆఖరి నిముషం దాకా పోరాడతారనే ప్రచారం వుంది. ఇక్కడ సీనియర్ నేత బండారు సత్యన్నారయణమూర్తి వున్నారు. కష్టకాలంలో నమ్ముకుని నిలబడితే ఆఖరి నిముషంలో అవకాశాలను ఎగరేసుకుపోతే చూస్తూ ఊరుకోవాలా అనే వాదన వినిపిస్తోంది. పైగా., చోడవరం, యలమంచిలి ఇన్చార్జు లు కాపు సామజిక వర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ చర్చనీయాంశం. ఈ మార్పులు చేర్పులు ఆలోచనల వెనుక పార్టీకి ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నాయకత్వంను అందించడమే కారణమని పైకి చెబుతున్నప్పటికీ రాజకీయ వారసుడి కోసం అయ్యన్న పడుతున్న జాగ్రత్తగానే వీటిని చూడాల్సి ఉందట. ఎంపీగా టిక్కెట్ తెచ్చుకోవడం కంటే బలమైన ఎమ్మెల్యే అభ్యర్ధులను బరిలో నిలపడం వల్లే…గెలుపు సాధ్యమనేది అయ్యన్న ప్లాన్‌. మీద కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ టిక్కెట్ కోసం అయ్యన్న గట్టి పట్టే పట్టేలా కనిపిస్తోందట. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో వుండాలంటే తొలి ప్రయత్నం బలంగా వుం డాలని యోచిస్తున్నారట.

Exit mobile version