Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!

  • ఆదిలాబాద్ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై కౌన్సిలర్స్‌ అసంతృప్తి
  • కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ పెండింగ్‌పై అనుమానాలు
  • ఛైర్‌పర్సన్‌ మెతకవైఖరి వెనక ఏదో ఉందని డౌట్స్
  • మున్సిపాలిటీ ముందే సొంత కౌన్సిలర్స్‌ ధర్నా
  • పనులు జరక్క కౌన్సిలర్స్‌కు చెయ్యి ఆడటం లేదన్న టాక్‌
  • ఆనవాయితీగా అవ్వాల్సిన పనులు కూడా కావడం లేదన్న ఫ్రస్ట్రేషన్‌
  • ఛైర్‌పర్సన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఫీలింగ్‌
Off The Record

Off The Record

Off The Record : ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కాంగ్రెస్‌ కూటమి మధ్య సిగపట్ల సీన్స్‌ కనిపిస్తున్నాయి. మొత్తం 49 వార్డులుండగా బీజేపీ 21 వార్డులను గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.కాంగ్రెస్ 11 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ 6,ఎంఐఎం 6,స్వతంత్రులు 5 స్థానాలు గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్నీ కలిసి ఇండిపెండెంట్ బండారి అనూషను చైర్ పర్సన్ చేశాయి. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి మిత్రపక్షాల కూటమి కొనసాగుతూనే ఉంది. కానీ… ఇప్పుడు వాటాల లొల్లి మురిదిందట. అష్టలక్ష్మి జిన్నింగ్, సీసీఐ ఫ్యాక్టరీకి సంబందించి ప్రాపర్టీ టాక్స్‌ కోట్లలో పెడింగ్‌లో ఉండడంతో కౌన్సిలర్లకు అనుమానం వచ్చిందట. చైర్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, లావాదేవీల విషయాలను తమతో చర్చించడం లేదని వాళ్ళు మనసులో పెట్టుకున్నారంటున్నారు. ఏదో జరిగిపోతోందని, పైగా చైర్ పర్సన్ లబ్ది పొంది బాకాయిల వసూళ్లల్లో మెతక వైఖరి అవలంభిస్తున్నారనే అభిప్రాయం కౌన్సిలర్స్‌లో బలపడిందట.

అందులో నిజం లేదని ఆమె చెప్పుకొస్తున్నా..వాళ్ళకు నమ్మకం కలగడం లేదని అంటున్నాకు. బకాయిలు వసూలు చేయడం లేదని కూటమి కౌన్సిలర్లు ఏకంగా మున్సిపాలిటి ముందే ధర్నా చేయడం వెనక వాటాలా ముచ్చట ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి చైర్ పర్సన్‌, కౌన్సిలర్ల మద్య సయోధ్య లేకుండా పోవడం ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష సభ్యులైన బిజెపి వారంతా సమావేశం హాల్లో ఉండగా సొంతోళ్ళే వాకౌట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అదే క్రమంలో చైర్ పర్సన్ అన్ని వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారంటూ వ్యతిరేకంగా నినాదాలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. వార్డుల్లో చూసిచూడనట్టుగా నడవాల్సిన పనులు కాకపోవడం, పైగా ఆయా వార్డుల్లో వివిధ పనులకు భూమి పూజలు చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో కౌన్సిలర్లకు చేయి తిరగడం కష్టంగా మారిపోయిందని అంటున్నారు. కాంట్రాక్టర్ పనులు స్టార్ట్ చేయకపోవడానికి ఓ కీలక నేతకు కమీషన్ ఇవ్వకపోవడమే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి.

కొన్నిచోట్ల ఆనవాయితీగా రావాల్సినవి సైతం రాకపోవడం వల్లే వివాదం అవుతోందంటున్నారు. తెరచాటున ఏం కావాలని కోరుకున్నారో గానీ… ఆదిలాబాద్‌ కూటమిలో విభేదాలు తారా స్థాయికి చేరడం, అందులో సొంత పార్టీ నేతలు సైతం ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో పండగల ఖర్చులు, లేదా పనుల విషయంలో చూసి చూడనట్టుగా ఉండేవారట. అకేషనల్‌గా ఓ ఆనవాయితిగా జరిగే పనులు సైతం కౌన్సిలర్లకు కాకుండా పోతున్నాయన్నది ప్రస్తుత ఆవేదనగా చెబుతున్నారు. ఎవరో చక్రం తిప్పారని, తమకే నష్టం జరిగిందనే భావనలో ఉన్నారట కౌన్సిలర్స్‌. చైర్ పర్సన్ ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నారన్నదే వాళ్ళ బాధగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ చోట నిర్వహించిన విందుతో మున్సిపల్ రాజకీయం మరింత రచ్చ అయిందని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చివరకు ఎటు దారితీస్తాయో చూడాలంటున్నారు స్థానికులు.