Site icon NTV Telugu

Dancer Janu: నిన్న చావు, నేడు పెళ్లి.. ఢీ ‘జాను కథా చిత్రమ్’!

Janu

Janu

తెలుగులో ఒక పాపులర్ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన తెలంగాణ ఫోక్ డాన్సర్ జాను నిన్న ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. “ఇక బతకలేను, నా ఓపిక నశించింది. ఎవరైనా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు విన్నప్పుడు, ఎందుకు అలా చేసుకుంటారనిపించేది. కానీ నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు,” అంటూ ఏడుస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తన క్యారెక్టర్ గురించి దారుణంగా మాట్లాడుకుంటున్నారని చెబుతూ, “అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు,” అని గుక్కపెట్టి ఏడ్చింది.

Read More: Janulyri : జానులిరి, నేను పెళ్లి చేసుకుంటున్నాం.. దిలీప్ దేవ్ గన్ క్లారిటీ..

“నేను ఎవరికైనా హాని చేశానా? నా వల్ల ఎవరైనా నష్టపోయారా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నా గురించి మంచి కూడా ఉంది కదా? మంచి చెప్పొచ్చు. చెల్లితో మాట్లాడినా, అన్నతో మాట్లాడినా, కూర్చున్నా, నిలబడినా, చెడుగానే చూస్తున్నారు. నేనేం పాపం చేశాను? నాకు నరకంగా అనిపిస్తోంది. నేను భరించలేకపోతున్నాను. మీరు చేస్తున్నది తప్పు. ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేది ఏమీ లేదు. ఒకరిని చంపి, ఒకరిని బాధపెట్టి మీరు బతకొద్దు. నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలో, ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. నా జీవితం మీద మీకెందుకు అంత ఆసక్తి? మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకోవడం? నా కొడుకుని బాగా చదివించి, మంచి పొజిషన్‌లో చూడాలనుకున్న’ అంటూ ఏడుస్తూ వీడియో పెట్టింది.

Read More:Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!

దానికి కారణం, ఆమె ఫోక్ సింగర్ అయిన దిలీప్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి బయటకు రావడమే. నిజానికి, జానుకి శేఖర్ మాస్టర్‌తో ఏదో ఉందనే ప్రచారం గతంలో చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. కానీ, నిన్న సదరు సింగర్‌తో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వెంటనే ఆమె ఏడుస్తూ వీడియో పెట్టేసింది.
కానీ, తెల్లవారేసరికి, “నేను ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటాను. నిన్న ఏదైతే వీడియోలు చేశాను, అవి చూసి చాలామంది బాధపడ్డారు, రియాక్ట్ అయ్యారు, సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్. కొంచెం బాధనిపించి డిప్రెషన్‌లోకి వెళ్లాను, అంతే. తప్ప, నేను ఎవరికీ భయపడను. భయపడితే ఇక్కడ ఉండేదాన్ని కాదు,” అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత, “నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. దానివల్ల ఎవరికైనా నష్టం ఉందా? అవును, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు, నేను సంతోషంగా ఉన్నాము. ఆ సంతోషంతోనే నేను సమాధానం చెప్తాను. ఇక ట్రోలింగ్ ఆగదని నాకు అర్థమైంది. ఇకమీదట ట్రోలింగ్‌ని పట్టించుకోను,” అంటూ పెళ్లి అనౌన్స్‌మెంట్ చేసింది. నిన్నటికీ, నిన్న “నా పెళ్లి గురించి మీకెందుకు? అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, అక్రమ సంబంధాలు అంటూ” బోరున ఏడుస్తూ వీడియో పెట్టిన ఆమెకు, తెల్లారేసరికి సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టాలనిపించిందేమో? అంతే, నిన్నటి వీడియోలన్నీ డిలీట్ చేసేసింది. ఈ మొత్తం వివాదంలో ఆమెకు ఫాలోవర్లు మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగిపోయారు.

Exit mobile version