తెలుగులో ఒక పాపులర్ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన తెలంగాణ ఫోక్ డాన్సర్ జాను నిన్న ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. “ఇక బతకలేను, నా ఓపిక నశించింది. ఎవరైనా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు విన్నప్పుడు, ఎందుకు అలా చేసుకుంటారనిపించేది. కానీ నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు,” అంటూ ఏడుస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తన క్యారెక్టర్ గురించి దారుణంగా మాట్లాడుకుంటున్నారని చెబుతూ, “అన్నతో…