Special Focus On Harsha Sai, Jani Master And Raj Tarun : కింద మీద పడి ఫేమస్ అయిన వాళ్ళు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాజ్ తరుణ్ జానీ మాస్టర్ హర్ష సాయి అదే చేశారా?
మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఈరోజు యూట్యూబర్ హర్ష సాయి ఈ ముగ్గురిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరి మీద నార్సింగి పోలీస్ స్టేషన్లోనే వరుస రేప్ కేసులు నమోదయ్యాయి. ఒకరు పాపులర్ యూట్యూబర్ పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు. ఇంకొకరు ఫేమస్ డాన్స్ మాస్టర్, అసిస్టెంట్ జీవితంతో చెలగాట మాడాడు. మరొకరు రీల్ హీరో అమ్మాయి లైఫ్ లో విలన్ గా మారాడు. ఈ ముగ్గురిపై రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు చేసే పనులు వేరు వేరు అయినా సరే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆరోపణలు మాత్రం సేమ్ టు సేమ్. అవకాశాల పేరిట అమ్మాయిలతో ఆడుకున్నారు, నమ్మించి నయవంచన చేశారు. ఇవన్నీ బాధితురాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఒక్క మాటలో చెప్పాలంటే రేప్ కేసులో రాజ్ తరుణ్, జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి అడ్డంగా బుక్కయ్యారు.
తాజాగా హర్ష సాయి మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ యువతి ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని రెండు కోట్ల రూపాయలు డబ్బు కాజేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నార్సింగి పోలీసులు యువతి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి సైతం తరలించారు. మారుమూల గ్రామాలలో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్ళలో ఆనందం తాను చూస్తూ, వీడియోల ద్వారా అనేక వందల మంది కళ్ళకు చూపిస్తూ యూట్యూబ్ లో ఒక హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి. మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా అతని ఖాతాలకు సెలబ్రిటీ లెవల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ మధ్య అతను చేస్తున్న పనులు కాంట్రవర్సీ అయ్యాయి. ఎంత తక్కువ టైంలో ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల హర్ష సాయి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. హర్ష ఇచ్చిన స్టేట్మెంట్ ని చాలామంది యూట్యూబర్లు తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఫేమ్ యువతి ఆయన మీద చీటింగ్ కేసుతో పాటు రేప్ కేసు కూడా పెట్టడంతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారాడు.. యూట్యూబ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఓ యువతి హర్ష సాయి మీద సంచలన ఆరోపణలు చేసింది. తన వద్ద నుంచి పెళ్లి పేరుతో రెండు కోట్ల రూపాయల వరకు దండుకున్నాడంటూ ఆమె ఆరోపణలు చేయడంతో పాటు కేసు పెట్టడం మరింత సంచలనానికి దారితీస్తుంది. పేదలకు సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉండడంతో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని వాడుకుంటూ ఆ మధ్య హీరోగా కూడా మారే ప్రయత్నం చేశాడు సొంత దర్శకత్వంలో హీరోగా మారుతూ మెగా ’లోడాన్’ అనే ఒక సినిమా అనౌన్స్ చేయడమే కాదు టీజర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా ఈవెంట్ లాగా నిర్వహించాడు. సీన్ కట్ చేస్తే రేపు కేసులో చిక్కుల్లో పడ్డాడు..
మరోపక్క హీరోలతో స్టెప్పులు వేయించాల్సిన డాన్స్ మాస్టర్ కటకటాల పాలయ్యాడు. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడి ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. చాలాసార్లు యువతిపై లైంగిక దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హర్ష సాయి యూట్యూబర్ గా తక్కువ టైంలోనే ఫేమస్ అయితే జానీ మాస్టర్ కూడా అంతే తక్కువ సమయంలోనే కష్టపడి పైకి వచ్చి మంచి పాటలు సంపాదించి మంచి పేరు సంపాదించాడు. కెరీర్ పీక్స్ లోకి వెళుతుంది అనుకుంటున్న సమయంలో తప్పుడు పనులతో అడ్డంగా బుక్కయ్యాడు. అసిస్టెంట్ పై లైంగిక దాడి ఆరోపణలతో జానీ మాస్టర్ పై రేప్ కేసు తో పాటు పోక్సో చట్టం కూడా నమోదయింది.. ఈనెల 19 అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ని 14 రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ కి అప్పగించారు. పోలీసులు పోలీసు కస్టడీ కోరడంతో నాలుగు రోజులు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ వ్యవహారంతో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్టు అయింది.
ఇక రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా ఈ ఎపిసోడ్స్ అయితే కొన్ని రోజుల క్రితం వరకు డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా నడిచింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో కొన్ని రోజులపాటు ఈ వ్యవహారం నడిచింది. చివరికి లావణ్య చేసిన ఆరోపణలు వాస్తవమే అని పోలీసులు తేల్చారు. హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ ముందు నుంచి ఒక డైలీ సీరియల్ లాగా ఎన్నో ట్విస్టులు, టర్నులతో నడిచింది. నారీ నారీ నడుమ రాజ్ తరుణ్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా కాలమే నడిచింది. తిరగబడరా స్వామి అనే సినిమా కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమయంలో లావణ్య రాజ్ తరుణ్ మీద తిరగబడింది. రాజ్ తరుణ్ పురుషోత్తముడు కాదు నయవంచకుడు అంటూ విరుచుకుపడింది. ప్రేమ పేరుతో తనను రాజ్ వాడుకొని మోసం చేశాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు గతంలో కడుపు కూడా తీయించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న తనను వదిలేసి ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అనే కొత్త హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అందుకు సంబంధించిన పలు ఆధారాలను కూడా సమర్పించడంతో చివరికి పోలీసులు ఆమె చెప్పిన ఆరోపణలు నిజమేనని తేల్చి కోర్టుకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు..
మొత్తానికి హర్ష సాయి, జానీ మాస్టర్, రాజ్ తరుణ్ పైత్యపు పనులతో అడ్డంగా బుక్కయ్యారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీ స్థాయిలో ఉండి అమ్మాయిలు జీవితాలతో ఆడుకున్నారని మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.