Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, ప్రస్తుతానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ కె.పి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, సినిమా ఏదో భిన్నంగానే ఉండేలా కనిపిస్తోంది.
READ MORE: AP Govt: తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపిన ఏపీ సర్కార్..
అయితే ఈ సినిమా షూట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకా రెండు షెడ్యూల్స్ షూట్ చేస్తే సినిమా పూర్తవుతుంది. ఇదిలా ఉండగా ఎక్కడ మొదలైందో, ఎందుకు మొదలైందో తెలియదు గానీ, సాయిధరమ్ తేజ్ తన తరువాత సినిమా ఫైనల్ చేశాడని, ‘రిపబ్లిక్ 2’ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై సాయిధరమ్ తేజ్ టీమ్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, అదేమీ నిజం కాదు అని తెలిసింది.
ప్రస్తుతానికి సాయిధరమ్ తేజ్ ఫోకస్ అంతా ‘సంబరాల ఏటిగట్టు’ మీదనే ఉందని అంటున్నారు. 125 కోట్ల రూపాయల ప్రాజెక్టు కావడంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీదనే ఆయన ఫోకస్ చేశారని, ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ఏదైనా సినిమా ఫైనల్ చేస్తే అఫీషియల్‌గా ఆయన కానీ లేదా టీం కానీ, అనౌన్స్ చేస్తారని, మిగతా రూమర్స్‌ను నమ్మవద్దని చెబుతున్నారు. మొత్తం మీద సాయిధరమ్ తేజ్ తదుపరి సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ నిజం కానట్టే.
