Site icon NTV Telugu

Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!

Ssmb29

Ssmb29

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు.

Also Read :RV Karnan: ఐడీ కార్డులు వేసుకోని ఏజెంట్లు.. ఎన్నికల అధికారి కర్ణన్ సీరియస్..

ఈ నెల 15వ తేదీ అంటే రాబోతున్న శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ఈవెంట్ జరగబోతోంది. అయితే, ఇదే ఈవెంట్‌లో సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ కూడా జరగవచ్చు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ టైటిల్ రివీల్ జరుగుతుందా లేదా అనే విషయం మీద పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే, ఇప్పటివరకు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, మధ్యలో ఓ చిన్న సినిమా అదే పేరుతో టైటిల్ అనౌన్స్ చేయడంతో, టైటిల్ అనౌన్స్ చేస్తారా లేదా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

Also Read :Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!

అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ఇప్పుడు ప్రచారం చేస్తున్నట్టు గ్లోబ్ ట్రాట్టర్ అంటే కూడా సంచారి అని అర్థం వస్తుంది. కాబట్టి, ఈ సినిమాకి అదే టైటిల్ అని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఎస్.ఎస్.రాజమౌళిస్ వారణాసి అని లేదా మహేష్ బాబు వారణాసి లేదా ఎస్.ఎస్.ఎం.బి. వారణాసి అని టైటిల్ రిజిస్టర్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం ఉంది. మరి, రాజమౌళి ఏం చేయబోతున్నారనేది త్వరలోనే తేలిపోనుంది.

Exit mobile version