మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ శనివారం నాడు, అంటే సరిగ్గా మరో మూడు నాలుగు రోజులలో జరగబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తెలుగు మీడియాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే రాజమౌళి పెద్దగా తెలుగు మీడియాని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తెలుగు మీడియా ఆయనను ‘మహారాజమౌళి’, ‘మన రాజమౌళి’ అని అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం ఇది ‘మా మీడియా’, ‘మన మీడియా’ అని ఫీల్ అయ్యే పరిస్థితి లేదు.
Also Read :RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
అయితే అలా జరగడానికి కారణం ఏమిటనే విషయం మీద చర్చ జరుగుతుండగా, ఈ మధ్యకాలంలోనే ‘బాహుబలి’ రీ-రిలీజ్ సందర్భంగా ప్రభాస్ సహా రానాతో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ‘బాహుబలి’ రిలీజ్ అయిన సమయంలో తన వదిన, కీరవాణి భార్య శ్రీవల్లిని, తెలుగు మీడియా వ్యక్తులు ఉన్న ఒక గ్రూపులో అనుకోకుండా జాయిన్ చేశారని, ‘బాహుబలి’ రిలీజ్ సమయంలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొని వెళుతున్న పోస్టర్‌ను ఎడిట్ చేసి, అక్కడ జండూబామ్ ఎత్తుకుని వెళుతున్నట్లుగా పోస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అది చూసి తనకు బాధ కలిగినట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే బహుశా తెలుగు మీడియాని దూరం పెట్టడానికి ఇది ప్రధానమైన కారణం అయి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే అలాంటి క్రియేటర్ క్రియేషన్‌ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ, ఇలా వెంటనే మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తే వారు తట్టుకోలేరు అనే భావన వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఆయన అలా తెలుగు మీడియాని దూరం పెట్టడం కరెక్టో కాదో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
