Site icon NTV Telugu

Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?

Rahul

Rahul

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించిన కొంతమంది వ్యక్తులను కలిసిన విషయం తెలిసిందే. బీహార్ నుంచి వీరిని ఢిల్లీకి పిలిపించి వారితో కలిసి టీ తాగారు. అనంతరం రాహుల్ గాంధీ సోషల్ సైట్ ఎక్స్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై వ్యంగ్యంగా స్పందించారు. “నాకు జీవితంలో చాలా ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి.. కానీ ‘చనిపోయిన వ్యక్తులతో’ టీ తాగే అవకాశం ఎప్పుడూ రాలేదు… ఈ ప్రత్యేకమైన అనుభవానికి కారణమైన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు!” అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. రాహుల్ గాంధీని కలిసిన వారు బీహార్‌లోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. కానీ.. రాహుల్‌గాంధీకి ఓ కథ తెలియదు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!

1972లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంగఢ్ నివాసి అయిన లాల్ బిహారీని ప్రభుత్వ పత్రాల్లో చనిపోయినట్లు ప్రకటించారు. ఆస్తిపై దురాశతో లాల్ బిహారీ కుటుంబ సభ్యులు తహసీల్దార్ సహకారంతో లాల్ బిహారీని చనిపోయినట్లు ప్రకటించారని చెబుతారు. బతికి ఉండగానే ఇతడి భూమిని కూడా ఆక్రమించుకున్నారు. 22 సంవత్సరాల పోరాటం తర్వాత, లాల్ బిహారీకి చివరకు 1994లో న్యాయం లభించింది. కోర్టు ఆదేశాల మేరకు, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని పత్రాలను సరిదిద్ది లాల్ బిహారీ బతికే ఉన్నట్లు ప్రకటించారు. కోర్టు విచారణల సమయంలో తనను ‘లాల్ బిహారీ మృతక్ హాజిర్ హో’ అని పిలిచేవారని, అందుకే లాల్ బిహారీ తన పేరు ముందు మృతక్ అనే పదాన్ని కూడా చేర్చుకున్నారని ఆయన గతంలో చెప్పారు. తన పోరాట సమయంలో తనలాంటి వారిని ఏకం చేసి మృతక్ సంఘ్‌ను ఏర్పాటు కూడా చేశారు. గత 50 సంవత్సరాలుగా బతికి ఉన్నా చనిపోయినట్లు ప్రకటించిన వారి కోసం ఈ సంఘం కృషి చేస్తోంది.

READ MORE: President Murmu speech: రాజ్యాంగం.. ఆపరేషన్ సింధూర్‌పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి లాల్ బిహారీ 1989లో రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకు ముందు, మరొక మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌పై కూడా పోటీ చేశారు. లాల్ బిహారీ 2024లో ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. లాల్ బిహారీ పోరాటంపై బాలీవుడ్ చిత్రం ‘కాగజ్’ చిత్రాన్ని కూడా నిర్మించారు. నటుడు పంకజ్ త్రిపాఠి ‘కాగజ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

READ MORE:Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!

వాస్తవానికి.. బాధితుడు తను బతికే ఉన్నానని నిరోపించుకోవడానికి కోర్టులో చాలా కష్టపడ్డారు. అప్పట్లో దేశం, యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండింది. విశేషం ఏంటంటే.. లాల్ బిహారీ ఇప్పటికీ బతికే ఉన్నారు. కానీ.. రాహుల్ గాంధీ, రాజీవ్‌గాంధీకి లాల్ బిహారీతో టీ తాగాలని పించలేదు. వాళ్ల హయాంలో చేసిన తప్పు బట్టబయలు అవుతుందని బతికి ఉన్నా చనిపోయాడని ప్రకటించిన లాల్ బిహారీతో టీ తాగే ప్రయత్నం చేయలేదు. రాజీవ్ గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయనను పట్టించుకోలేదు.

Exit mobile version