NTV Telugu Site icon

Pushpa 2 : ఇండియాలోనే హయ్యెస్ట్.. ఇది సార్ పుష్ప గాడి రేంజు!!

Pushpa 2 Records

Pushpa 2 Records

Pushpa 2 Digital Rights Bagged by Netflix for 275 Crores: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మొదటి భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, ధనుంజయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. కేవలం తెలుగు సహా సౌత్ లాంగ్వేజెస్ లోనే కాదు నార్త్ లో కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ ని చాలా కేర్ఫుల్ గా డైరెక్ట్ చేస్తున్నాడు సుకుమార్. ఏ మాత్రం వెనకాడకుండా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా రీ షూట్స్ చేస్తూ సినిమాని జక్కన్నలా చెక్కుతున్నాడు. ఇక ఈ పుష్ప రెండో భాగం రిలీజ్ కి ముందే ఎన్నో సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయిన వెంటనే అనేక రికార్డులు బద్దలు కొడుతూ వస్తోంది. నిజానికి ఇప్పటికె ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేయగా ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఎన్టీవీకి ఎక్స్ క్లూజివ్ గా తెలిశాయి.

NTR: మా అమ్మ కల నెరవేర్చా.. రిషబ్ శెట్టితో పిక్ షేర్ చేసిన ఎన్టీఆర్

అవేమిటంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను టాప్ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ఫ్లిక్స్ సంస్థ ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి వెచ్చించనంతగా వెచ్చించి మరీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ సుమారు 275 కోట్లకు నెట్ఫ్లిక్ సంస్థ కొనుగోలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అనిల్ తడాని ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేశాడు అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీద. ఇది కూడా ఇప్పటి వరకు ఒక సౌత్ సినిమాకు నార్త్ లో వచ్చిన హైయెస్ట్ రేట్ అని తెలుస్తోంది.

ఇక మ్యూజిక్ కూడా భారీ రేటు పలికింది. టి సిరీస్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ హక్కుల కోసం 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది కూడా ఒక రికార్డు అని చెబుతున్నారు. ఇక మొత్తం మీద చూసుకుంటే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ మొత్తం కలిపి 1000 కోట్లు రిలీజ్ కి ముందే ఇంకా చెప్పాలంటే షూటింగ్ పూర్తి కాక మునుపే బిజినెస్ జరిపేసుకుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ బిజినెస్ అత్యధికమని తెలుస్తోంది. గత ఏడాది పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించాడు. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆయనకు నేషన్ వైడ్ గుర్తింపు లభించింది.

ఇప్పుడు ఆ క్రేజ్ మరింత పెరుగుతూ పుష్పరాజ్ అంటే తెలియని వారు లేకుండా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు నార్త్ లో కూడా సత్తా చాటాయి. పుష్ప అనుకోకుండా నార్త్ లో సత్తా చాటడంతో ఈసారి పుష్ప సెకండ్ పార్ట్ తో ఇండియా వైడ్ మరింత రచ్చ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. అన్నట్టు ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలు ఫహాద్ ఫాజిల్ – అల్లు అర్జున్ కాంబో సీన్స్ షూట్ సెప్టెంబర్ 3 నుంచి జరుగుతుంది. వాయిదా ప్రచారాలను అనేక సార్లు ఖండించిన టీం డిసెంబర్ 6 న చిత్రాన్ని దాదాపు 13 భాషల్లో విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.