టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే.. వస్తే పొలోమని అందరు హీరోలు ఒకేసారి వస్తారు. లేదంటే ఒక్కరు కూడా రారు. ఈ ఏడాది సుమ్మర్ ను వృధా చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు మేమంటే మేము అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో పోటీ ఏర్పడింది. వారిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, మెగా స్టార్ చిరు విశ్వంభర, OG సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి ఈ ముగ్గురు స్టార్ హీరోలు సెప్టెంబర్ లో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Also Read : Shilpashetty : పింక్ శారీలో శిల్పంలా మెరుస్తున్న శిల్పా శెట్టి
బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవి OG. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇక చిరు విశ్వంభర కూడా అదే డేట్ జూ వచ్చేందుకు రెడీ అవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మూడు సినిమాలలో ఒక సినిమా సెప్టెంబర్ నుండి తప్పుకోబోతుంది. చిరు విశ్వంభర సెప్టెంబర్ రిలీజ్ ఫిక్స్. ఇక మిగిలిన OG, అఖండ 2లలో ఒక సినిమా మాత్రం సెప్టెంబరు నుండి తప్పుకుని అక్టోబరు 2న రిలీజ్ అవుతుందని తెలిసింది. మరి సెప్టెంబర్ పోటీ చిరు vs బాలయ్య అవుతుందో చిరు vs పవన్ కళ్యాణ్ అవుతుందో చూడాలి.
