NTV Telugu Site icon

Nayanathara- Dhanush: నయనతారా మీరు చేసేదేమన్నా సమాజ సేవా? ఎందుకీ పైత్యం?

Nayanthara Vs Dhanush

Nayanthara Vs Dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ మీద సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చేసిన ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. తన పెళ్లి డాక్యుమెంటరీ లో నాన్ రౌడీధాన్ సినిమా పాటలు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తండ్రి దర్శకుడు- సోదరుడు దర్శకుడు, అలాంటివారి సపోర్ట్ తో ఇండస్ట్రీకు వచ్చి గొప్ప నటుడిగా మారిన మీరు దీన్ని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీ ప్రేమికులకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది అంటూ ఆమె పేర్కొన్నారు. ఎన్ఓసి కోసం రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నా, ఆ డాక్యుమెంటరీ రిలీజ్ కానున్న సమయంలో మీ ఆమోదం కోసం ఎదురు చూశాం.

Pushpa 2: పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు?

చివరికి మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసిందని అంటూ ఆమె వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసమే మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వలేదని అంటూ ఆరోపించింది. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీసులో మూడు సెకన్ల క్లిప్పు వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరం అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది అని కానీ మీ అభిమానులకి మీ గురించి పూర్తిగా తెలియదని చెప్పుకొచ్చింది. కాపీరైట్ చట్ట ప్రకారం మీరు కరెక్ట్ అయ్యుండొచ్చు కానీ నైతిక కోణంలో మాత్రం మీరు కరెక్ట్ కాదని అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ నయనతార భలే ఆరోపించింది, భలే కడిగిపారేసింది అంటూ సోషల్ మీడియాలో ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఆమెను అందలం ఎక్కిస్తున్నారు.

చాలామంది స్టార్లు కూడా నయనతార కు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. కానీ అసలు ఇక్కడ ధనుష్ ఎందుకు తన దగ్గర ఉన్న కాపీరైట్స్ ఫ్రీగా ఇవ్వాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నయనతార దంపతులు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. నెట్ఫ్లిక్స్ కోసం వాళ్ళు ఏమి చారిటీ చేయలేదు కదా అలాంటప్పుడు వాళ్లు చేసేది వ్యాపారమైనప్పుడు అలాంటి వ్యాపారమే చేసే నిర్మాతగా సినిమా చేసిన ధనుష్ ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? నిజంగానే వారి మధ్య వ్యక్తిగత వివాదాలు ఉండి ఉండవచ్చు కానీ వాటిని ఇలా బహిరంగపరచడంలో ఆమె ఉద్దేశం బహిర్గతం అవుతుంది. కేవలం ధనుష్ మీద బురద చల్లడం కోసమే ఆమె ఇలా చేసిందని ధనుష్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

నిజానికి ఈ కాపీరైట్ అంశాల మీద ఈమధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది దానికి కారణం ఇళయరాజా. ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఇతర కచేరీలలో కూడా పాడకుండా ఆయన తన పాటలు మీద ఎన్నో రకాల కాపీరైట్స్ చట్టాలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అవన్నీ ఆయన స్వరపరిచిన పాటలు కాబట్టి. అలాగే ఈ సినిమా విషయంలో కూడా అన్ని హక్కులు ఉన్న ధనుష్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది? అనేది ధనుష్ అభిమానుల వాదన. ఈ విషయంలో నయనతార బుద్ధి ఏమిటో బయట పెట్టిందని ధనుష్ లాంటి మంచి మనిషి మీద ఇలాంటి ఆరోపణలు చేసిన ఎవరూ నమ్మరు అని వారు వెనకేసుకొస్తున్నారు..