Site icon NTV Telugu

Mega Heroes: 2026లో పండగలన్నింటినీ కబ్జా చేస్తున్న మెగా హీరోలు

Mega Heros

Mega Heros

2026 సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది. ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి, వేసవి వరకు నిరాటంకంగా కొనసాగనుంది. దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 2026 ప్రథమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు.

Also Read :Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి!

సంక్రాంతి బరిలో మెగాస్టార్
ప్రతీ ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసేలా ఉన్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సంక్రాంతికి మెగా సందడి ఖాయమైంది.

మార్చిలో రామ్‌చరణ్ ‘పెద్ది’
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాను 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ తేదీకి శ్రీరామనవమి, గుడ్‌ఫ్రైడే వంటి పండగలు కలిసిరావడంతో సినిమాకు లాంగ్ వీకెండ్ లభించనుంది. పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంతో వేసవికి ముందే మెగా ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ అందనుంది.

Also Read :Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా

మహాశివరాత్రికి పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’?
మెగాస్టార్, రామ్‌చరణ్ తమ తేదీలను ఖరారు చేసుకోగా, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వంతు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది. సంక్రాంతి, మార్చి నెలలు లాక్ అవడంతో, మధ్యలో ఉన్న మహాశివరాత్రి పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే, ప్రతీ నెలా ఒక మెగా హీరో థియేటర్లలో సందడి చేయడం ఖాయం.

వేసవిలో యువ హీరోల జోరు
ఇక ఏప్రిల్, మే నెలల్లో మెగా కాంపౌండ్‌లోని యువ హీరోలు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ తమ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో 2026 ఫస్టాఫ్ మొత్తం మెగా హీరోల చిత్రాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. మొత్తానికి, ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా బరిలోకి దిగుతూ 2026ను “మెగా నామ సంవత్సరంగా” మార్చేందుకు మెగా హీరోలు సిద్ధమయ్యారు.

Exit mobile version