NTV Telugu Site icon

Tollywood Rewind 2024 : టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఎవరెవరంటే?

List Of Debut Heroines In

List Of Debut Heroines In

ఎట్టకేలకు 2024 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 2024 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు తమ అరంగేట్రం చేశారు. ఈ హీరోయిన్లు తమ నటనా నైపుణ్యంతో, తమ అందంతో తమదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముఖుందన్ భలే ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు. అయితే టాలీవుడ్లో ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళదాం పదండి

దీపికా పదుకోన్‌:
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్‌ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ మూవీలోని సుమతి పాత్రలో నటించారు దీపికా పదుకోన్‌.

అన్నా బెన్‌
‘కల్కి 2898 ఏడీ’ మూవీతో మలయాళ నటి అన్నా బెన్‌ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్‌.

భాగ్యశ్రీ బోర్సే
– మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. రవితేజ సరసన నటించిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు.

జాన్వీ కపూర్ – దేవర 2 సినిమాలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మాత బోనీ కపూర్ మరియు దివంగత నటి శ్రీదేవి కుమార్తె. ఆమె బాలీవుడ్ నటి, ధడక్, రూహి, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ మరియు ఘోస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలలో నటించిన ఆమె దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ప్రీతి ముకుందన్ –
నటి ప్రీతి ముకుందన్ తన అద్భుతమైన నటనతో తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. తమిళనాడులోని తిరుచ్చిలో పుట్టి పెరిగిన ప్రీతి 2024లో ఓం భీమ్ బుష్ అనే సూపర్‌హిట్ చిత్రంతో టాలీవుడ్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచీ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బి టెక్ డిగ్రీని పొందింది ప్రీతీ.

రుక్మిణి వసంత్ –
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2023లో, ఆమె రొమాంటిక్ సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ మరియు సైడ్ బితో తెలుగు వారికీ దగ్గరైనా నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మానుషి చిల్లర్
మిస్ వరల్డ్ 2017 కిరీటం పొందిన మానుషి చిల్లర్ వరుణ్ తేజ్‌తో కలిసి 2024లో చేసిన ఆపరేషన్ వాలెంటైన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

పంఖురి గిద్వానీ –
ఫెమినా మిస్ ఇండియా 2016 రన్నరప్‌ పంఖురి గిద్వానీ 2024లో నవదీప్ సరసన లవ్ మౌళి అనే రొమాంటిక్ డ్రామాలో నటించి తెలుగు అరంగేట్రం చేసింది.

అతిర రాజి –
మలయాళ నటి అతిరా రాజీ 2024లో, సత్య దేవ్‌కి జోడీగా కృష్ణమ్మ అనే ఇంటెన్స్ డ్రామాతో తెలుగు అరంగేట్రం చేసింది.

సిరి లెల్ల –
సిరి లెల్ల 2024 పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి 2లో తన అరంగేట్రం చేసింది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతినిధి (2014)కి సీక్వెల్. సిరి లెల్లా నారా రోహిత్‌ సరసన నటించి ఏకంగా రియల్ లైఫ్ జోడీగా మారనుంది.

సంయుక్త విశ్వనాథన్ – సంయుక్త విశ్వనాథన్ 2024లో వెన్నెల కిషోర్ యొక్క స్పై యాక్షన్ కామెడీ చిత్రం చారి 111 ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

భూమి శెట్టి – కన్నడ-భాషా టెలివిజన్ సిరీస్ కిన్నారిలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన నటి భూమి శెట్టి 2024లో చైతన్య రావు షరతులు వర్తిస్తాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

నయన్‌ సారిక:
హీరోయిన్‌ నయన్‌ సారిక 2024లో ఏకంగా మూడు సినిమాలు చేసింది. అనంద్‌ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’తో టాలీవుడ్ కి పరిచయమైన ఆమె నార్నే నితిన్‌ ‘ఆయ్‌’, కిరణ్‌ అబ్బవరం ‘క’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి.

తన్వీ రామ్‌
ఇక కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తన్వీ రామ్‌.

Show comments