మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న కన్నప్ప మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. తర్వాత ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని వార్తల నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తర్వాత ప్రభాస్ శివుడిగా నటించడం లేదని, అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడని ప్రకటించారు. ప్రభాస్ మరో కీలక పాత్రలో నటించగా, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
Also Read:HYD Animal Smugglers: రెడ్ శాండిల్ స్మగ్లర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు..
ప్రమోషనల్ కంటెంట్ తొలుత ఎన్నో ట్రోల్స్‌కి గురైంది. తర్వాత సినిమా కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో వచ్చిన ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక కొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా మీద ప్రభాస్ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే, చివరి 40 నిమిషాల గురించే సినిమా చూసిన వారందరూ మాట్లాడుతున్నారు. నిన్న కొంతమంది హిందీ క్రిటిక్స్‌కి షో వేశారు. వారంతా కూడా చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉన్నాయని, గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు.
Also Read:War2- coolie : 50 డేస్ కౌంట్ డౌన్.. ఏంటీ కొత్త ట్రెండ్..
తిన్నడు అనే వ్యక్తి కన్నప్పగా, పదిమంది నైనారులలో 9వ నైనారుగా ఎలా మారాడు, ఆ పరిణామ క్రమం ఏమిటి, న్నాస్తికుడిగా ఉన్న అతను పరమశివ భక్తుడిగా ఎలా మారాడు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. మీకు ఇష్టమైన మోహన్‌లాల్ సీక్వెన్స్ అయితే అద్భుతంగా కుదిరిందని, ప్రభాస్ ఎపిసోడ్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. అవే సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లేలా ఉన్నాయని కూడా టాక్. మంచు విష్ణు పర్ఫామెన్స్ గురించి కూడా సినిమా చూసిన వారు ప్రత్యేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే, మూడు గంటల నిడివి సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం అయ్యేలా కనిపిస్తోంది. అయితే, గూస్‌బంప్స్ మూమెంట్స్ కనుక గట్టిగా ఉంటే, ఆ నిడివి కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు.
