రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు అందుకుంది, దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ లేని సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ లాక్ అయింది. ఈ మేరకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరోపక్క నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ కూడా నచ్చడంతో దాదాపుగా ఒకే సమయంలో ఈ రెండు సినిమాలు షూట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది..