Site icon NTV Telugu

Sridhar Babu: అందుకే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..

Sridhar Babu

Sridhar Babu

కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేము అందరం నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పక్ష నేతగా రేవంత్‌రెడ్డిని నిర్ణయించినప్పుడు అందరం కలిసి పని చేయాలని ఆ నాయకుడికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆలోచించాం. అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి మంచి నాయకుడు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి తరువాత మరొకటి పూరించే కార్యక్రమంతో పాటు తెలంగాణాను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం ఉంది.

READ MORE: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. “సెకన్ టూ సెకన్” ఏం జరిగిందంటే..?

ఆ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము కూడా బాధ్యతతో పని చేస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంలో దగ్గరగా ఉండి చూస్తున్నాం. ఒక బలమైన, లక్ష్యమున్న నాయకుడి లక్షణాలు సీఎం రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నాయి. అధిష్టానం అన్ని బేరీజు చేసుకుని ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను నమ్ముతున్నా. ప్రజలకు మేలు జరుగుతలేదు అనే సీఎం రేవంత్‌రెడ్డిలో కనిపించింది. ఒక లక్ష్యం ఉంది. ఒక ఆలోచన ఉంది. అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ లక్ష్యాన్ని చేరాలని పట్టుదల ఉన్న వ్యక్తిగా కనిపించారు. దానికి తోడు అతడి ప్రణాళికలు, సమయం, సందర్భం అన్ని తీర్ల కలిసి వచ్చింది. కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలతో కూడా కలిసి నడిచారు. వారు సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాలకు అనుగుణంగా మేము నడుస్తు్న్నామని మంత్ర శ్రీధర్ బాబు వెల్లడించారు.

READ MORE: Murder : చేతబడుల అనుమానంతో అన్న పీక కోసిన తమ్ముడు

 

Exit mobile version