Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆంధ్ర వర్సెస్ తెలంగాణ’ అన్నట్టుగా ఓ పెద్ద వివాదమే నడుస్తోంది. నిజానికి ‘ఇడుపు కాయితం’ అనే పేరుతో బన్నీ వాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా ప్రారంభించిన సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ వివాదం తెరమీదకు వచ్చింది. అయితే, ఈ వివాదానికి కొద్ది రోజుల ముందు, గతంలో తెలుగు సినిమాలకు రివ్యూస్ ఇస్తూ ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన యూట్యూబర్, “తెలంగాణ అంటే భాష” అంటూ ఒక వీడియో చేశాడు. నిజానికి తెలంగాణది యాస అని చాలామంది రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ “మా తెలంగాణది యాస కాదు, భాష” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ జనసేన ఇష్యూలో అనవసరంగా తెలంగాణ వివాదాన్ని లేపిన క్రమంలో మొదలైంది. అక్కడ ఒక విశ్లేషకుడు, ఒక రాజకీయ పార్టీకి మధ్య జరిగిన వివాదాన్ని కొంతమంది తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సదరు యూట్యూబర్ కూడా ఆ వివాదంతో కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్‌తో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా “తెలంగాణ భాష” అంటూ ఒక వీడియో చేశాడు. దాన్ని చూసిన ఒక నెటిజన్, ఈ ‘ఇడుపు కాయితం’ ఓపెనింగ్ అయిన రోజున ఆ సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ, “ఇది తెలంగాణ భాషలో రిలీజ్ చేస్తారట కదా, తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా లేదా?” అంటూ సదరు యూట్యూబర్ చేసిన వీడియోకి కౌంటర్‌గా మాట్లాడాడు.
Also Read
- NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
- Tollywood : టాలీవుడ్‌ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
అయితే, అది కచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని అవమానపరిచే విధంగా ఉండడంతో, ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయింది. అతను తన తప్పు తెలుసుకుని అది తొలగించే లోపు, ఈ విషయం దావాగ్నిలా వ్యాపించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. అంతేకాక, కవిత లాంటి వారు సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి ముడి పెడుతూ కామెంట్స్ చేసేదాకా వెళ్ళింది. వాస్తవానికి జరుగుతున్న అంశం ద్వారా కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించే ఓ యూట్యూబర్, తన తెలంగాణ ప్రాంతపు యాసను భాషగా భావిస్తూ గొప్పతనంగా చెప్పుకున్న విషయాన్ని… మరో సోషల్ మీడియాలో పనిలేని వ్యక్తి సీరియస్‌గా తీసుకుని దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడిన విధానం సరిగా లేకపోవడం ఇప్పుడు రెండు ప్రాంతాల వాసుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మరి మీ ఉద్దేశం ప్రకారం ఈ వివాదానికి కారణం ఆ ఇద్దరిలో ఎవరు? ఎవరి కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!