Site icon NTV Telugu

Harihara Veeramallu: హరిహరా.. ఏమిటీ కన్ఫ్యూజన్?

Harihara Veeramallu

Harihara Veeramallu

నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు మొత్తం తిరిగి వస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని నమ్మడం కంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?. నిజానికి తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే అసలు నమ్మశక్యంగా ఉందా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వస్తుంది.

Also Read:Nabha : ఈ సంతోషాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటా!

“ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో” అన్నట్టుగా.. ‘హరి హర వీరమల్లు’ గురించి ఇలా తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఆ ప్రచారకర్తలకే తెలియాలి. పవన్ కళ్యాణ్ మొదటిసారి నటించిన పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. పైగా ఆయన చారిత్రక యోధుడిగా నటించిన తొలి చిత్రం. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ తో ఎక్కడా రాజీ పడకుండా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. 2020 ద్వితీయార్థంలో మొదలై, 2022 జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. వీరమల్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అనే మూడు సినిమాలు వచ్చాయంటే.. ఈ చిత్రం ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఈ చిత్రానిది. అసలే భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్. దానికి తోడు షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సహజంగానే బడ్జెట్ పెరిగిపోయింది.

మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రమిది. మరి ఈ సినిమా, ఏ స్థాయి బిజినెస్ అవుతుంది?. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు గత చిత్రాలకు మించి అధిక ధరలు చెప్తున్నారు. పలువురు బయ్యర్లు ఈ భారీ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ.. నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఒక రూపాయి అటో ఇటో తమ సినిమాకి పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా నిర్మాతలు సినిమా హక్కులు అమ్మేస్తారు. ఇది ప్రతి సినిమాకి జరిగే వ్యవహారమే. హరి హర వీరమల్లుకి బయ్యర్లు లేరు అనేది అవాస్తవం. చాలా మంది బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు.. సరైన డీల్స్ కోసం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారనేది వాస్తవం. కానీ, కొందరు మాత్రం వీరమల్లుకి బయ్యర్లు లేరంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.

Also Read:Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్

కొన్ని చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. బాహుబలి చిత్రం రెండు భాగాలకు కలిపి నాలుగైదేళ్లు పట్టింది. ఆ చిత్రం.. తెలుగు సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి హర వీరమల్లు కూడా అలాంటి చిత్రమే. కొన్ని కారణాల వల్ల ఒక్క భాగానికే ఐదేళ్లు పట్టి ఉండవచ్చు. కానీ తెలుగులో అత్యంత అరుదుగా వచ్చే చారిత్రాత్మక చిత్రమిది. ఇలాంటి చిత్రాలను భుజానికెత్తుకోవాల్సిన బాధ్యత ప్రతి సినీ ప్రేమికుడిపై ఉంది. “బయ్యర్లు లేరు, బజ్ లేదు, ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి,” అంటూ.. ‘హరి హర వీరమల్లు’ స్థాయిని, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చారు అంటే అది పవన్ మంచితనం అనుకోకుండా ఇంకేదో అన్నట్టు ప్రచారం మొదలు పెట్టడం చర్చలకి తావిస్తోంది. తెలిసో తెలియక మీడియా, సోషల్ మీడియాలో కొందరు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

సినిమా అనేది ఒక వ్యక్తికి సంబంధించినవిషయం కాదు. దాని వెనుక వందల కోట్ల ఖర్చు, వందలాది మంది కష్టం ఉంటుంది. ఒక్క సినిమా మీద వేలాది మంది ఆధారపడి ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా.. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ప్రచారం చేయకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి తిరుగులేని అగ్ర కథానాయకుడు సినిమాకి బయ్యర్లు లేరంటే.. కొంచెం కూడా ముందు వెనుక ఆలోచించకుండా తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదనే చెప్పాలి. నిజానికి ‘హరి హర వీరమల్లు’ సినిమాకి పవన్ కళ్యాణ్ గత చిత్రాలను మించిన బజ్ ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. నిర్మాతలు ఇంకా వాయిదా పడుతుందని చెప్పలేదు, ఒకవేళ పడినా, ఆలస్యంగా వచ్చినా వీరమల్లు లెక్కలు మారుస్తాడు అని టీం భావిస్తోంది .

Exit mobile version