Site icon NTV Telugu

Kaantha: ‘కాంత’ దాసులయ్యేందుకు పోటీ!

Kaantha

Kaantha

దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!

1950 పీరియడ్ డ్రామాగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొట్టమొదటి తమిళ సూపర్‌స్టార్ ఎం కె త్యాగరాజ భగవతర్ బయోపిక్ అనే ప్రచారం ఉంది. అయితే ఈ సినిమా అవుట్‌పుట్ అత్యద్భుతంగా వస్తుందని ఇన్‌సైడ్ టాక్. మహానటి లాగా ఈ సినిమాని కూడా ఓటీటీ ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారనే ఉద్దేశంతో ఓటీటీ సంస్థలు ఈ ప్రాజెక్టుని దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Also Read:Machilipatnam: మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం.. మచిలీపట్నంలో హైటెన్షన్..

అందులో భాగంగానే పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాని దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఒకరకంగా సినిమా మాకు కావాలంటే మాకు కావాలంటూ సినిమా నిర్మాతలైన దుల్కర్ సల్మాన్, రానాలకు టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. మామూలుగానే బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు దుల్కర్ సల్మాన్ లాంటి హీరో ఒప్పుకున్న కథ, రానా నిర్మిస్తున్న కథ కావడంతో సినిమా మీద ఓటీటీ సంస్థలకు మంచి ఆసక్తి ఏర్పడిందని చెప్పవచ్చు.

Exit mobile version