Site icon NTV Telugu

Tollywood: యంగ్‌ హీరోలు హిట్‌ కొట్టాలంటే బడ్జెట్‌ పెంచాల్సిందేనా..?

Tollywood

Tollywood

Tollywood: తెలుగు సినిమా బడ్జెట్‌లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు.

రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు సైతం ఆడియన్స్‌ను కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు.

100W ఛార్జింగ్, OLED డిస్ప్లేలు, Bose స్పీకర్లతో Poco F8 సిరీస్ గ్లోబల్ లాంచ్..!

100 కోట్ల క్లబ్‌లో యంగ్ హీరోలు:
యంగ్ హీరోల్లో మొట్టమొదటి 100 కోట్ల బడ్జెట్‌ హీరోగా నాని నిలిచారు.
నాని – ‘ప్యారడైజ్’: నాని 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘దసరా’ సినిమాకు 60 కోట్లు ఖర్చుపెట్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ హిట్‌తో వీరి తదుపరి చిత్రం ‘ప్యారడైజ్’ బడ్జెట్ డబుల్ అయినట్టు తెలుస్తోంది. దసరా తర్వాత ఈ కాంబో రిపీట్ కానుంది.

సాయి దుర్గ తేజ్ – ‘సంబరాల ఏటి గట్టు’: మెగా హీరో సాయి దుర్గ తేజ్ సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్‌ క్లబ్‌లో చేరినట్టు సమాచారం. ఈ సినిమా పేరు ‘సంబరాల ఏటి గట్టు’గా ప్రచారం అవుతోంది.

తేజా సజ్జా – ‘మిరాయ్’: ‘హనుమాన్’ సినిమా హిట్‌తో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తేజ్ సజ్జా ప్రస్తుతం 80 కోట్ల బడ్జెట్‌తో ‘మిరాయ్’ సినిమా చేస్తున్నారు.

నిఖిల్ – ‘స్వయంభు’: హీరో నిఖిల్ తన సినిమా ‘స్వయంభు’ను ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది.

నాగచైతన్య – ‘వృషకర్మ’: అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్లు. ఇందులో సెట్స్ ఖర్చు మాత్రమే 30 కోట్లు అని తెలుస్తోంది.
సక్సెస్ గ్యారెంటీ ఇవ్వని బడ్జెట్

Snapdragon 8 Gen 5 SoCతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 15R.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇదిగో..!

అయితే ఇంత బడ్జెట్ పెంచినప్పటికీ.. ఎంత కొత్తగా ట్రై చేసినా రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ పెంచినంత మాత్రాన హిట్‌కాదు అనేది వాస్తవం. దీనికి ఉదాహరణగా, హై బడ్జెట్‌తో తీసినా నిరాశపరిచిన ‘కింగ్‌డమ్’ సినిమాను ప్రస్తావించవచ్చు. ‘కింగ్‌డమ్’ ఫ్లాప్ అయినా, విజయ్ దేవరకొండ మాత్రం వెనక్కి తగ్గకుండా హై బడ్జెట్‌తోనే తన తదుపరి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా, తెలుగు సినిమా నిర్మాణం పూర్తిగా కొత్త దశకు చేరుకుంది. యంగ్ హీరోలు ధైర్యంగా 100 కోట్ల బందీలను తెంచుకొని భారీ బడ్జెట్‌లతో ముందుకు సాగుతున్నారు.

Exit mobile version