సంక్రాంతికి ఒక నెల ముందే ..డిసెంబరులో ఈసారి కొత్త సినిమాల జాతర కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు భారీ, మీడియం, చిన్న సినిమాలు వరుస కట్టాయి.డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీసుని రూల్ చేయడానికి ‘పుష్ప 2’తో వస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ తర్వాత మిగతా సినిమాలు క్రిస్మస్ సెలవులని టార్గెట్ చేశాయి. ఏకంగా డజను సినిమాలు చివరి రెండు వారాల్లో వస్తున్నాయి. అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’తో డిసెంబరు 20న వస్తున్నాడు.ఇదొక రియల్ లైఫ్ స్టొరీ. గమ్యం నాంది సినిమాల్లా తన కెరీర్ లో గుర్తుండిపోతుందని నమ్మకంగా చెబుతున్నాడు నరేష్. అలాగే ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సారంగపాణి జాతకం’ డిసెంబర్ 20నే వస్తోంది. కామెడీకి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డార్లింగ్ తో నిరాశ పరిచాడు ప్రియదర్శి. ఇంద్రగంటి గత సినిమాలు నిరాశ పరిచాయి. ఇద్దరికీ ఈ సినిమా కీలకం.
Vikatakavi: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్న ‘వికటకవి’ సిరీస్
డిసెంబర్ 20న రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.మల్టీ ట్యాలెంటెడ్ ఉపేంద్ర నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘యూఐ’. ఇదొక ఫాంటసీ చిత్రం. ఉపేంద్ర ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో ఆయన ఎలాంటి అంశాలను టచ్ చేశాడనేది ఆసక్తి కరంగా మారింది. డిసెంబర్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మాంచి సినిమాలకు వేదికయ్యిందా.ఓ డబ్బింగ్ సినిమాతో పాటు మాంచి లవ్ స్టోరీలు ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యాయా….? ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతుంది…?
గతేడాది ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘విడుదల’కు సీక్వెల్‌గా రూపొందిన ‘విడుదల: పార్ట్ 2’డిసెంబరు 20న విడుదల కానుంది. పార్ట్ 1 తమిళ్లో మంచి విజయం సాధించింది కానీ తెలుగులో పెద్దగా ఆదరణ దొరకలేదు. పార్ట్ 2 రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి. వీటితో పాటు మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా,రాజేంద్ర ప్రసాద్ మనవరాలు తేజస్విని నటించిన ఎర్రచీర సినిమాలు కూడా డిసెంబర్ 20నే వస్తున్నాయి. అలాగే నితిన్ ,దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిస్తున్న క్రైమ్ కామెడీ ‘రాబిన్‌హుడ్’. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. తన కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని స్వయంగా నితిన్ చెబుతున్నాడు. డిసెంబరు 25న రిలీజ్అవుతోన్న ఫిలిం ఈ ఏడాదికి మాంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుందని చెబుతున్నారు.
డిసెంబర్ 25న వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు లోకి వస్తోంది. తేరీకి రీమేక్ ఇది.అలాగే డిసెంబర్ 27న పతంగ్ అనే ఓ చిన్న సినిమా వస్తోంది.ఇప్పటి వరకు తెలుగులో చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కాని గాలిపటాల స్పోర్ట్స్ డ్రామాతో ‘పతంగ్’ అనే సినిమా రాబోతుంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ఈ పతంగ్ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి ఈసారి సంక్రాంతి ముందే బాక్సాఫీసు దగ్గర పండగ కళ కనిపిస్తోంది.