టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరో పరిస్థితి పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి సినిమాతో పర్లేదు అని మెప్పించిన ఆ హీరో రెండవ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస బెట్టి ఓ డజను సినిమాలు చేసాడు. కానీ మరల హిట్ అనేది చూడలేదు. అదేదో సినిమాలో యాంకర్ సుమ చెప్పినట్టు ఆడీయన్స్ మీద రివెంజ్ అనుకుంటా అనే రేంజ్ లో సినిమాల మీద సినిమాలు వదిలాడు. ఒక్కోటి ఒక్కో దారుణమైనా ప్లాప్స్.
అయినా సరే ఆగదు ఈ పోరాటం అనే సూక్తిని ముక్తకంఠంతో బిగించి హిట్ కొట్టాలనే కసితో సినిమాలు చేసాడు. అలా మొత్తానికి గతేడాది రిలీజ్ అయిన సినిమా ఊహించిన దానికి మించి భారీ హిట్టు కొట్టాడు. అటు ప్రేక్షకులు కూడా మనోడిపై కాస్త సింపతీ చూపించడంతో రేస్ లో మూడు సినిమాలు ఉన్నా కూడా భారీ ‘క’లెక్షన్స్ అందించారు. ఇక ఈ హీరో గాడిలో పడ్డాడు అనుకున్నారు. తర్వాతి సినిమా సూపర్ హిట్ కొడతాడు అని అంతా అనుకుంటే ఇప్పుడు రాబోతున్న సినిమా పట్ల హీరోగారు నామ్ కే వాస్త్ లా వ్యవహరిస్తున్నాడు. ఎదో తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేసి ‘మమ’ అనిపించేస్తున్నాడు అట. అయితే ఈ సినిమా కంటెంట్ పట్ల హీరో సంతృప్తిగా లేడని అందుకే మొక్కుబడిగా నడుచుకుంటున్నాడు అని టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా నుండి వచ్చిన కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సినిమాకు హీరో బ్యాకెండ్ లో డబ్బులు పెట్టి భారీఎత్తున ప్రమోట్ చేసాడు. సొంత సినిమాల భావించి మరొక యంగ్ హీరోను అథిదిగా పిలిచాడు. కానీ మరికొద్ది రోజులల్లో రిలీజ్ కాబోతున్నఈ సినిమాకు బయట నిర్మాత కావడంతో అంతగా పట్టించుకోవట్లేదట. అలాగే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా కొనే వారు లేరని కమిషన్ బేస్ కింద రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా హీరోలు నిర్మాతల పట్ల కాస్త మంచి దిల్ ఉండాలి.