NTV Telugu Site icon

144 Section: భారీ బడ్జెట్ సినిమాలకి కొత్త తలనొప్పి!!

144

144

తెలంగాణ ప్రభుత్వం పలు కారణాలతో హైదరాబాదులో 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ విధిస్తూ పబ్లిక్ మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు ఇతర మీటింగ్స్ ఏమీ ఒక నెలపాటు ఉండకూడదని ప్రకటించారు. ఈ 144 సెక్షన్ నవంబర్ 27వ తేదీ వరకు వర్తించనుంది. ఇప్పటికే ఒకపక్క బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనలు మరోపక్క రాజకీయ పార్టీలు నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పలు పెద్ద సినిమాల ఈవెంట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దీపావళి సినిమాలకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు పూర్తయ్యాయి.

Chiranjeevi: టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి

రేపు క సినిమా ఈవెంట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో చాలా తక్కువ మందితో నిర్వహించబోతున్నారు. అయితే సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా నవంబర్ 14వ తేదీన నిర్వహించబోతున్నారు. అయితే సినిమా ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించాలనుకున్నారు కానీ తాజా నిర్ణయంతో ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వరుణ్ తేజ్ మట్కా సినిమాకి సంబంధించి కూడా భారీగా ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ తాజా నిర్ణయం ఆ సినిమాకి తలనొప్పిగా మారింది. కేవలం ఇండోర్ ప్రమోషన్స్ కి సినిమా యూనిట్ పరిమితం అవ్వాల్సి ఉంటుంది. తర్వాత విశ్వక్సేన్ హీరోగా నటించే మెకానిక్ రాఖీ కూడా నవంబర్ 22వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ సినిమా యూనిట్ కూడా తక్కువలోనే ప్రమోషన్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 27వ తేదీ వరకు ఈ 144 సెక్షన్ నడవ నుండగా ఆ తర్వాత దాన్ని ఎత్తివేస్తే అప్పుడు సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ కోరే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాదులో పర్మిషన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది సినిమా యూనిట్. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు హైదరాబాదు 144 సెక్షన్ పెద్ద సినిమాల నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.